వాడి పేరు వింటేనే అస‌హ్యం అంటోన్న ర‌మాప్ర‌భ‌… ఇంత దారుణంగా ఆడేసుకుందే…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే ఈమె 1966 నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఈమె దాదాపుగా ఇప్పటి వరకు 1300 పైగా సౌత్ ఇండియా సినిమాలలో నటించినది. చిన్నతనం నుంచి తనకు నటన మీద ఎక్కువ మక్కువ ఉండడం చేత.. సినీ ఇండస్ట్రీలోకి చిన్న వయసు లోనే ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో ఎంతోమందితో నటించింది. అలా రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి నటులకు జోడిగా నటించింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో శరత్ బాబు.. విలక్షణమైన నటుడుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీ లో దాదాపు 300కు పైగా సినిమాలలో నటించారు ఈయన. నటుడుగానే కాకుండా ప్రతినాయకుని పాత్రలలో కూడా బాగా నటించి మెప్పించారు. ఇక రమాప్రభ, శరత్ బాబు ఇద్దరూ కలిసి ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు.

అయితే వీరి ప్రేమ విషయం టాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారింది.ఎందుచేత అంటే శరత్ బాబు కంటే రమాప్రభ వయసులో చాలా పెద్దది కావడం వల్ల వీరి ప్రేమకు ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరిలో ముందుగా రమాప్రభ శరత్ బాబు ను ప్రేమించిందట. ఇక వీరిద్దరి ప్రేమ గురించి.. సీనియర్ జర్నలిస్ట్, శరత్ బాబు రూమ్మేట్స్.. వెంకటేశ్వరరావు, సింగర్ ఆనంద్ కలిసి ఉండేవారట. రమా ప్రభ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక అలాంటి సమయంలో శరత్ బాబు ని ప్రేమించింది కాబట్టే.. శరత్ బాబు ఇంటికి వెళ్లి తనను పికప్ చేసుకుని వెళ్ళేదట రమాప్రభ. అంతే కాదు శరత్ బాబు కెరీర్ లో చాలా రకాలుగా ఆర్థికంగా హెల్ప్ చేసింది రమాప్రభ. ఆ సహాయం వల్లే ఆమెకు దగ్గరయ్యారని తెలియజేశారు జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు. అలా సెటిల్ అయిన తర్వాత రమాప్రభ ని శరత్ బాబు వివాహం చేసుకున్నారట. ఇక ఆ తర్వాత వాళ్లు రూము నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగిందని తెలిపారు.

అలా కొన్నేళ్ళపాటు వీరి సంసారం సవ్యంగా సాగిందని అయితే ఆ తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల విడాకులు తీసుకున్నారని దీంతో.. రమాప్రభ తనని వాడుకొని మోసం చేశాడని.. అందుచేతనే అతడు అంటే అసహ్యం అని తెలియజేసిందని తెలిపారు జర్నలిస్ట్.

Share post:

Popular