బాలయ్య కోసం నేష‌న‌ల్ అవార్డు హీరోయిన్‌..భారీ హైప్స్ ఇచ్చిన డైరెక్టర్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరు హీరో లు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..బిజీ బిజీ గా షూటింగ్ లల్లో పాల్గొంటున్నారు. మరీ ముఖ్యంగా యంగ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ..సీనియర్ హీరోలు రఫాడిస్తున్నారు. ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉంటారు నందమూరి నట సింహం బాలయ్య. అఖండ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈయన ప్రజెంట్ ఇద్దరు టాప్ డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు.

బాలయ్య…గోపీ చంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో ఆయన మనకు డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారట. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్..సినిమా కి సంబంధించిన కీలక సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటిస్తుంది. అంతేకాదు..పవర్ ఫుల్ పాత్రలో హీరోయిన్ రోల్ ను మించి పోయేలా..వరలక్ష్మి శరత్ కుమార్ నటించనుంది.

కాగా, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య..అనీల్ రావిపూడి తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటీకే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు అన్ని పూర్తి అయ్యిపోయాయట. ఈ సినిమాలో బాలయ్య..మనల్ని తండ్రి పాత్రలో మెప్పించబోతున్నారని స్వయంగా డైరెక్టర్ నే చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం తండ్రి కూతురు మధ్యనే ఉంటుందని..ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్లు స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆయన తెలియజేశారు.

కాగా, బాలయ్యకి కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. ఇక ఆమెకు తల్లి గా బాలయ్యకు భార్య గా నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటించబోతుందట. ఈ రోల్ కోసం చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నా ..ఫైనల్ గా మాత్రం ప్రియమణి ని ఫిక్స్ చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది. మరో పాత్రలో అందాల తార మెహ్రీన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది..దీంతో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి చూడాలి అనిల్ ఎలా మెప్పిస్తాడో..?

Share post:

Latest