ఏంటయ్యా ఈ పనులు..హీరోయిన్ కు కోపం తెప్పిస్తున్న ప్రభాస్…?

ప్రభాస్..ఈ పేరు చెప్పితే అదేదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు. ఆ హైట్ ..ఆ వెయిట్..ఆ హ్యాండ్ సమ్ లుక్స్..అయ్య బాబోయ్ ఆ కటౌట్ చూసిన జనాలు సలామ్ కొట్టాల్సిందే. అంత బాగుంటాడు ఈ హీరో. అయితే, ప్రజెంట్ పరిస్ధితి తేడా గా ఉన్నా..సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఉంది.

ప్రభాస్ వయసు పెరిగిపోయుంది..బాడీలో మార్పులు వస్తున్నాయి..మొహం మీద ముడతలు వచ్చేస్తున్నాయి..టోటల్ లుక్స్ మారిపోతున్నాయి..ముందు కమిట్ అయిన డైరెక్టర్స్ కూడా ప్రభాస్ లుక్స్ పరంగా టెన్షన్ పడుతున్నారు . దానికి తోడు ప్రభాస్ ఫూడీ అన్న సంగతి తెలిసిందే..అస్సలు కంట్రోల్ చేసుకోలేడట. కానీ, డైటింగ్ లు చేసే అలవాటు లేన్నట్లు తెలుస్తుంది. దీంతో బరువు కూడా పెరిగిపోతున్నాడు. సినిమాల కోసం తగ్గడానికి ట్రై చేస్తున్నాడట.

ఈ క్రమంలోనే ప్రభాస్ పై హాట్ బ్యూటీ మాళవిక మోహన్ గుర్రుగా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మనకు తెలిసిందే అమ్మడు మారుతి-ప్రభాస్ కాంబో రాబోతున్న సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా చేస్తుంది అన్ని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలు కావాల్సి ఉందట. కానీ, ప్రభాస్ బ్రేక్ వేశాడని టాక్. ఆ తరువాత మే మొదటి వారంలో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిద్ధాం అని అనుకున్నారట. సలార్ చిత్ర షూటింగ్, మరో వైపు ప్రాజెక్ట్ K షూటింగ్ తో కుదరలేదు అన్న టాక్ వినిపించింది.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి..జూన్ 10 న స్టార్ట్ చేద్దాం అని అనుకుని కూడా..బ్రేక్ వేశారట మేకర్స్ . ప్రభాస్ లుక్స్ డల్ అయిపోయాయి..ఈ సినిమాలో లవర్ భాయ్ గా కనిపించాలి..ఇలా డల్ లుక్ బాగోదు మరో నెల రోజులు గ్యాప్ తీసుకుని లుక్స్ మార్చే పనిలో పడ్డారట ప్రభాస్. అయితే , ప్రభాస్ తో సినిమా కోసం ఇప్పటి వరకు వచ్చిన మంచి ఆఫర్లను వదులుకుంటున్న మాళవిక ..ఇలా షూటింగ్ కి బ్రేకులు పడుతుండటంతో కోపం గా ఉందట. ప్రభాస్ లాంటి పాన్ ఇండీయా హీరో తో సినిమాలో నటిస్తే ఆ రేంజ్ ఫాలోయింగ్ అవకాశాలు దక్కుతాయి అని ఆశ పడిన మాళవిక ..ఆశలు నిరాశగానే మిగిలాయి..?

Share post:

Popular