పవన్ కళ్యాణ్ మేలుకో నాయనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఈ పేరు కు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా..ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్..మాత్రం ఎవ్వరికి లేదనే చెప్పాలి. నిజానికి సినీ ఇండస్ట్రీకి పవన్ ని ప్రమోట్ చేసింది చిరునే.. కానీ ఆ తరువాత చిరుని మించిన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు పవన్. కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా..ఫైనల్ గా యువతకు ఊపు తెప్పించిన హీరో మాత్రం పవనే.

ఒకానోక టైంలో ఇండస్ట్రీకి వరుస హిట్ సినిమాలు ఇస్తూ..టాలీవుడ్ పరువు ను ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఆ తరువాత కెరీర్ అనుకోని..ఊహించని మలుపులు తిరిగి..క్రింద మీద పడి మళ్ళీ సినిమాలు తీస్తున్నాడు . ఆయన సినిమాలు కొంతకాలం ఆపేసినా..జనాలు మాత్రం ఆయనని మర్చిపోలేదు..దేవుడు ఎప్పుడు దేవుడే..గుడిలో ఉన్నా..ఇంట్లో ఉన్నా..అన్న డైలాగ్ వాడుతూ పవన్ అభిమానులు ఆయనకు వకీల్ సాబ్ తో గ్రాండ్ సక్సెస్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు పవన్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. ఓ వైపు పాలిటిక్స్ ని ..మరో వైపు సినిమాలని రెండింటిని మ్యానేజ్ చేస్తున్నాడు. రెండింటికి న్యాయం చేయాలంటే అది కుదరని పని..ఖచ్చితంగా భవిష్యత్తులో పవన్ సినిమాలు అయినా వదులుకోవాలి..లేక రాజకీయాలకు అయిన గుడ్ బై చెప్పాలి. లేదంటే ఆయనకే కాదు..ఆయనని నమ్ముకున్న డైరెక్టర్స్, నిర్మాతలకి కూడా భారీ బొక్కే. ఈ విషయాని ఆలోచించి త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది సినీ, రాజకీయ నాయకుల విశ్లేషణ..మరి పవన్ ఏం చేస్తాడో..?

Share post:

Latest