చిరంజీవినే భ‌య‌పెట్టిన ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా …?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి అతి తక్కువ సమయంలోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎవరి సపోర్టు లేకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే చిరంజీవి పైకి వచ్చారని చెప్పవచ్చు. 1980 లో అప్పటి టాప్ హీరోయిన్ లలో రాధిక, భానుప్రియ, సుమలత, మాధవి , రాధ ఇలా ఎంతో మంది హీరోలతో చిరంజీవి నటించారు.

అయితే వీరందరిలో చిరంజీవి , రాధ జంటకు మంచి గుర్తింపు ఉంది. లావుగా ఉన్నప్పటికీ రాధా ఎంతో అందంగా డాన్స్ వేస్తూ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక చిరంజీవి డాన్సులు కూడా తెలుగు చిత్రంలో బాగా ట్రెండీగా నిలిచేది. మెగాస్టార్ డాన్స్ తో పోటీ పడుతూ..ప్రేక్షకులను అలరించే హీరోయిన్లలో చాలా తక్కువగా ఉండేవారు. కానీ మెగాస్టార్ కు మించిన డాన్స్ చేసే హీరోయిన్లు అప్పట్లో కేవలం ఒక్క రాధా మాత్రమే ఉండేదట.

వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చినప్పటికీ.. అలా వచ్చిన ప్రతి సినిమాలో కూడా రాధా..చిరంజీవి తో పోటీపడి డాన్స్ చేసేదట. అలా ఒకసారి ఒక సాంగ్ షూటింగ్ సమయంలో రాధా ను చూసి చిరంజీవి నీకు ఇంత తొందరగా డాన్స్ ఎలా వచ్చింది అని అడగగా.. ఆమె అసలు విషయం చెప్పకుండా నవ్వేసిందట. డ్యాన్స్ విషయంలో చిరంజీవి, రాధ బాగా పోటీ పడేవారు.. కానీ చిరంజీవి రాధా తో నటించేటప్పుడు మాత్రం బాగా కష్ట పడాల్సి వచ్చేదట.

తనకంటే బాగా ఫాస్ట్ గా స్టెప్పులను వేసే రాధా ను చూసి చిరంజీవి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదట. ఈ విషయాన్ని చిరంజీవి ఒకానొక సమయంలో తెలియజేశారు. ఇక చిరంజీవి రాధ ఇద్దరు కూడా మంచి డ్యాన్సర్లు కావడంతో ఆడియన్స్ లో వీరికి క్రేజ్ బాగా ఉన్నది. ఇక వీరిద్దరి మధ్య ఏవో ఎఫైర్స్ ఉన్నట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలను చూసి రాధ , చిరంజీవి నవ్వుకునేవారట.

Share post:

Popular