ఎన్టీఆర్ సినిమా.. మరింత ఆలస్యమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా, టైగర్ ఏ రేంజ్‌లో తనదైన యాక్టింగ్ చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.

అయితే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను లాంఛ్ చేయాలని తారక్ చూస్తున్నాడు. ఇక ఆ తరువాత వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఆ దాఖలాలు ఏవీ కనిపించడం లేదట. తారక్ సినిమాను లాంఛ్ చేసినా, పట్టాలెక్కించేందుకు మరికొంత సమయం పడుతుందట. కొరటాల ఇటీవల ఆచార్య చిత్రంతో తొలి ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో తారక్‌తో చేయబోయే సినిమా కోసం పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్నాడట.

అందుకే తారక్ సినిమాను లాంఛ్ చేసినా, దానికి ఫినిషింగ్ టచ్‌ను ఇచ్చేందుకే మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం కూడా కొరటాల వేట సాగిస్తున్నాడు. ఇలా కొన్ని అంశాల కారణంగానే ఎన్టీఆర్ 30వ చిత్రం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రూ.150 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.