మ‌రో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా మారుతోన్న మెగాస్టార్‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మెగా అభిమానుల్ని కలవరపెడుతోంది. మెగాస్టార్ కూడా త‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ మాదిరిగా మారిపోతున్నాడా ? అస‌లు చిరు ఏం చేయాల‌నుకుంటున్నాడు ? కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న వేళ మంచి క‌థాబ‌లంతో పాటు ప్రేక్ష‌కుల మ‌దిలో నాలుగు కాలాల పాటు నిలిచిపోయే సినిమాలు చేయ‌కుండా.. ప‌ర‌మ రొడ్డ‌కొట్టుడు సినిమాలు, ఫేడ‌వుట్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసేందుకు ఎందుకు ఓకే చెపుతున్నారో తెలియ‌క మెగాభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ప‌వ‌న్ కళ్యాణ్ కూడా ఎంతో క్రేజ్ ఉండి. గ‌త కొంత కాలంగా చెత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెడుతున్నాడు. అస‌లు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు, అజ్ఞాత‌వాసి, వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్ వీటిల్లో చాలా వ‌ర‌కు రీమేకులే ఉన్నాయి. ఇవి మేకుల్లా అభిమానుల‌కు గుచ్చుకుంటున్న‌డా ప‌వ‌న్ మ‌ళ్లీ రీమేక్‌ల వెంటే ప‌డుతున్నాడు. ఇక ఇప్పుడు చిరు కూడా రీమేకులు, అందులోనూ రాడ్డు రీమేకుల‌తో పాటు డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తుండ‌డం ఎవ్వ‌రికి మింగుడు ప‌డ‌డం లేదు.

కొర‌టాల శివ లాంటి డైరెక్ట‌ర్‌తో పైగా చర‌ణ్ ఉన్నా కూడా ఆచార్య ఇంత డిజాస్ట‌ర్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. చిరు నెక్ట్స్ లైన‌ప్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు నిద్ర రావ‌డం లేదు. ఆచార్యే ప్లాప్ అయ్యింది. నెక్ట్స్ తమిళ బ్లాక్ బస్టర్ వేదాలం రీమేక్ భోళా శంకర్ – మలయాళ హిట్ ఫిల్మ్ లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.ఈ రెండు ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతున్నారు.

ఇందులో భోళా శంక‌ర్ మ‌రీ టెన్ష‌న్ పెడుతోంది. మెహ‌ర్ ర‌మేష్ పేరు చెపితేనే టాలీవుడ్ భ‌య‌ప‌డుతోంది. నాలుగు డిజాస్ట‌ర్ సినిమాలు ఇచ్చిన మెహ‌ర్ చివ‌రి సినిమా షాడో. మెహర్ రమేష్ సినిమా చేసి దాదాపు 9 ఏళ్లవుతోంది. ఆయనని తెలుగు ఆడియన్స్ ఎప్పుడో మర్చిపోయినా ఎవ్వ‌రూ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌క పోయినా ఆయ‌న‌కు చిరు ఎందుకు ? ఛాన్స్ ఇచ్చారో అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఇక గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్ మోహ‌న‌రాజా కూడా అప్పుడెప్పుడో వ‌చ్చిన హనుమాన్ జంక్షన్ తరువాత తెలుగులో ఆయన చేస్తున్న సినిమా ఇది. మోహ‌న‌రాజా చిరు ఇమేజ్ మ్యానేజ్ చేయ‌డం క‌ష్ట‌మే. ఇక వాల్తేరు వీర‌య్య చేస్తోన్న బాబి కూడా జై లవకుశ వెంకీ మామ సర్దార్ గబ్బర్ సింగ్ .. ఇలా అన్నీ స్టార్ లతో తీసినావే హిట్ కాలేదు. ఉన్నంతలో జై ల‌వ‌కుశ ఎన్టీఆర్ ఇమేజ్‌తో నెట్టుకు వ‌చ్చింది. అసలు బాబి అనుభ‌వం ఈ సినిమాకు స‌రిపోవ‌డం లేద‌నే అంటున్నారు.