ఒక్కే చోట అక్కినేని ఫ్యామిలీ..పెళ్లి భాజా షురూ..?

గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం ఏదైన ఉంది అంటే అది అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించినదే . స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన..కొంత కాలం తరువాత ఏవో గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి..దూరంగా ఉంటున్నారు. మరి కొన్ని రోజుల్లో అఫిషియల్ గా విడాకులు రానున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

అంతేకాదు రీసెంట్ గా సమంత ఫాదర్ ని మీట్ అయిన నాగార్జున..ఇక పై సమంతకి అక్కినేని ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని..త్వరలోనే చై పెళ్లి అంటూ పూర్తి గా సమంతను తమ ఫ్యామిలీ లిస్ట్ నుండి తీశేశారట. ఇక తాజా గా అక్కినేని ఫ్యామిలీ నుండి..వాళ్ల ఫ్యామిలీ పిక్ నెట్టింట ప్రత్యేక్షమైంది. సుశాంత్ ఈ పిక్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్ క్షణాలల్లోనే వైరల్ గా మారింది. అంతేకాదు ఈ పిక్ ని చూసిన సమంత ఫ్యాన్స్ “MISS YOU SAM” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ అంతా నాగార్జున ఇంట్లో మీట్ అయ్యారు. దీనికి సంబంధించిన పికే ఇది. అయితే, ఉన్నట్లు ఉండి వీళ్లంతా ఒక్కే చోట కలవడానికి కారణం కూడా ఉందట. త్వరలోనే చైతన్య పెళ్లి పై అఫిషియల్ ప్రకటన ఇచ్చే క్రమంలోనే ఇలా గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసి..కొత్త కోడలు పిల్ల ని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫోటోలో సమంత లేకపోవడం ఓ వెలితి అయితే.. అఖిల్ కూడా కనిపించకపోవడం అక్కినేని ఫ్యాన్స్ కు కొంత నిరాశ కలిగించింది. మాల్దీవులకు వెళ్లిన అఖిల్‌ ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. మరి చూడాలి చై పెళ్లి పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

Share post:

Popular