బోనీక‌పూర్ కంటే శ్రీదేవిని ముందు పెళ్లాడుకోవాల‌ని చూసిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే ..!

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన అందంతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం తెలుగులోనే మూడు తరాలకు సంబంధించిన హీరోలతో నటించి తానేంటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలలో కూడా నటించింది. ఏ సినీ ఇండస్ట్రీలో కూడా హీరోకి హీరోయిన్ సమానంగా పోటీ ఇవ్వలేని సందర్భాలలో కూడా హీరోలకు ఈమె గట్టి పోటీ ఇచ్చి మంచి ఇమేజ్ సంపాదించుకుంది.

1980లలో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా ఎంత స్టార్ పొజిషన్ అనుభవించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇకపోతే అతిలోక సుందరి శ్రీదేవి ని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతోమంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా పోటీ పడ్డారు. టాలీవుడ్లో అయితే కొంత మంది స్టార్ హీరోలు కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇక వారు ఎవరు అంటే..

మురళి మోహన్:
ప్రముఖ నటుడిగా, స్టార్ హీరో గా, నిర్మాతగా రాజకీయవేత్త గా గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్ స్టార్ హీరో గా చలామణి అవుతున్న రోజుల్లో శ్రీదేవి ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పుడే ఇండస్ట్రీలో బాగా క్లిక్ అవుతున్న మురళీమోహన్ శ్రీదేవి ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నో చెప్పారు.

రాజశేఖర్:
యాంగ్రీ యంగ్ మాన్ గా గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ ను శ్రీదేవి తల్లి స్వయంగా వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకొని అని అడిగిందట. కానీ అప్పట్లో కెరియర్ పరంగా బిజీగా ఉండడంతో రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి అంగీకరించలేదు.

మిధున్ చక్రవర్తి:
ఇక ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మిధున్ చక్రవర్తి తో ప్రేమలో పడింది. దీంతో వీరిద్దరు మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ అప్పటికే వివాహమైన మిధున్ చక్రవర్తి తో మొదటి వారిని వదిలేస్తే నే శ్రీదేవిని ఇచ్చి వివాహం చేస్తామని ఆమె తల్లి కండిషన్ పెట్టిందట. ఇక దాంతో వీరిద్దరికీ పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది.తరువాత కాలంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిర్మాత బోనీకపూర్ ను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకుంది శ్రీ దేవీ.

Share post:

Popular