వావ్: అభిమానులకు మహేశ్‌ లేఖ.. ఏం రాసుందంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన “సర్కారు వారి పాట” సినిమా మరి కొన్ని రోజుల్లో ధియేటర్లో రిలీజ్ కానుంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంఛే హడావుడి మొదలు పెట్టేశారు. తమ అభిమాన హీరో చాలా ఏళ్ళ తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటంతో..బాక్స్ ఆఫిస్ రికార్డులు తిరగ రాయాలని పక్క ప్లాన్ తో దూసుకుపోతున్నారు. పైగా గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పరశూరాం..ఈ సినిమా కు దర్శకత్వం వహించడం తో సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు.

మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైయ్యాక అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. కామెడీ తో నవ్వించదం..మాస్ డైలాగ్స్ మెప్పించడం..డ్యాన్స్ తో చిందేయించడం..మహేస్ కు కొత్త కాదు. కానీ ఈ సినిమాలో మహేష్ పర్ ఫామెన్స్ మనం ఇదివరకు చూడని విధంగా ఉంటుందని..స్వయాన డైరెక్టర్ నే చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో..చిత్ర ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసిన సర్కారు వారి పాట టీం .. హైదరబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.

సినిమా రిలీక్ డేట్ దగ్గరకు రావడంతో సీన్ లోకి ఎంటర్ అయిన మహేశ్ ..కొద్ది సేపటి క్రితమే అభిమానులకు ఓ లేఖ రాశారు. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మహేశ్ రాసిన లేఖ లో ఏముందంటే..”‘సర్కారువారి పాట సినిమా షూటింగ్‌ ఫైనల్ గా పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ..మే 12న మిమ్మలని అలరించదనైకి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం మీరు అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని థియేటర్లలోనే చూడండి. అలా చూసి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి..ఇట్లు మీ మహేష్ బాబు” అని రాసుకొచ్చారు మహేష్ బాబు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతున్న సినిమా పై ఫ్యాన్స్‌కు మంచి విషయమే చెప్పారు. పైరసీ ని ఎంకరేజ్ చేయకండి అంటూ సినిమాని థియేటర్లలోనే చూడండని అని చెప్తూనే ..తన తదుపరి కొత్త సినిమా షూటింగ్‌ కూడా త్వరలోనే ఉందని గుడ్‌న్యూస్‌ చెప్పాడు.

Share post:

Popular