ఆ హీరోయిన్ సినిమాలన్ని ఫ్లాప్ అవ్వాల్సిందే.. ఇదేం శాపం తల్లి..!!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..చేసింది తక్కువ సినిమాలే.. హిట్ అయ్యినవి చాలా తక్కువ ..కానీ ఆమె పేరు చెప్పితే వణికిపోయే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అలాంటి పవర్ ఫుల్ టంగ్ గల హీరోయిన్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆమె స్వభావం ..అందుకే ఆమెకు ఇంతమంది శత్రువులు ఉన్నారు అంటారు కంగనా అభిమానులు. ప్రభాస్ సినిమాలో ఓ పాట ఉంది..” అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను.. నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను”..ఆ సాంగ్ లిరిక్స్ అమ్మడికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఆమెను ఒక్క మాట అంటే తిరిగి పది మాటలు మాట్లాడుతుంది. అందుకే కొందరు ఆమె జోలికి వెళ్ళరు.

కాగా రీసెంట్ గా లాకప్ అనే రియాలిటీ గేమ్ షో కి హోస్ట్ గా చేసింది. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేసి అలరించింది.కాగా, ఈ షో విన్నర్‌గా నటుడు మునావర్‌ ఫరూఖీ నిలిచాడు. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో .. నటి పాయల్‌ రోహత్గీ రన్నర్‌గా నిలిచింది. నిజానికి ముందు నుండి విన్నర్ అయ్యే ఛాన్సులు పాయల్‌ కే ఎక్కువగా కనిపించాయి. లాస్ట్ వీక్ లో మాత్రం ఓట్లు తారుమారు అయ్యాయి. దీంతో ఈ షో విన్నర్‌ గా నటుడు మునావర్‌ ఫరూఖీ తన పేరుని లిఖించుకున్నాడు. అయితే దీన్ని పాయల్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ షో టీం, హోస్ట్‌ కంగనాపై సోషల్‌ మీడియా వేదికగా పాయల్ తీవ్ర విమర్శలకు దిగింది. అంతే కాదు కంగనా సినిమాలు అన్ని ఫ్లాప్ కావాలని శాపం పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది.

లాకప్‌ గేమ్‌లో భాగంగా ‘పాయల్‌ ఈ ఎపిక్‌ టెస్ట్‌ పాసవుతుందా?’ అనే గతం పోస్ట్‌ను ఆమె రీషేర్‌ చేస్తూ.. సంచలన పోస్ట్ చేసింది. “గేమ్ ఆడకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వాడిని విన్నర్ చేశారు..ఇదే ఈ షో స్పెషాలిటీ. పెళ్లై ..భార్య పిల్లలు ఉన్న ఈయన పక్క కంటెస్టెంట్లతో రొమాన్స్ చేసినా తప్పులేదు..అలాంటి ఆయనని విన్నర్ ని చేశారు. ఇదంతా కుట్ర . లాకప్‌ షో ఫైనల్‌ ఎపిసోడ్‌ జరిగే కొన్ని రోజుల ముందు.. కంగనా రనౌత్..బిగ్‌బాస్‌ హోస్ట్‌ సల్మాన్ ఖాన్ సిస్టర్ అర్పిత ఖాన్‌ ఈద్‌ పార్టీలో పాల్గొంది. అక్కడే వీళ్లు మాట్లాడు కుని..ఇలా లాస్ట్ లో తారుమారు చేసి ..విన్నర్ గా అతగాడిని నిల్చోపెట్టారు. ఇక పై ఆమెను ఫాలో అవ్వాను. కంగనా సినిమాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నా” అంటూ శాపం పెడుతూ రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారింది.

Share post:

Popular