NTR30 కధ బన్నీదే..పోస్టర్ తో అడ్డంగా బుక్కైన కొరటాల..!!

నిన్న తారక్ పుట్టిన రోజు..కోట్లాది మంది అభిమానుల విషెస్ తో.. సంతోషంగా జరుపుకున్నారు NTR. తారక్ పుట్టిన రోజును ఓ పండగల చేసుకున్నారు ఆయన అభిమానులు. అర్ధ రాత్రి నుండే కేక్ కట్టింగ్ లు అరుపులు, కేకలు..వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న తారక్ బర్త డే సంధర్భంగా ప్రశాంత్ నీల్ ఆయన తో తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో తారక్ చించేసాడు. ఒక్క పోస్టర్ తో సినిమా పై బోలెడు అంచనాలను పెట్టుకునేలా చేశారు.

ఇక బర్త డే ముందు రోజే..కొరటాల శివ తారక్ అభిమానులకు ట్రీట్ ఇస్తూ అద్దిరిపోయే వీడియోని రిలీజ్ చేసారు. ఇందులో తారక్ ముఖం కనిపించనప్పటికి..డైలాగ్స్ తో కుమ్మేశాడు. ఆ డైలాగ్స్ ని బట్టి చూస్తుంటే..NTR30 రీవేంజ్ సినిమా అని క్లీయర్ గా అర్ధమవుతుంది. ఈ సినిమా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దిరిపోయింది.

హమ్మయ్య..అంతా ఓకే అనుకుంటున్న టైంలో..పిడుగు లాంటి న్యూస్ వైరల్ అవుతుంది. అదే..తారక్ తో కొరటాల తీస్తున్న సినిమా కధ ఇదివరకే బన్నీ తో తెరకెక్కిదాం అనుకున్న మాస్ ఎంటర్ టైనర్ అని..దానికి సంబంధించిన పోస్టర్ తో నెటిజన్స్..కొరటాల శివ ను ట్రోల్ చేస్తున్నారు. మనం పోస్టర్లు గమనించిన ఆ డౌట్ రాక మానదు. సేమ్ డిట్టో అదే విధంగా ఉన్నట్లు NTR30 పోస్టర్..అల్లు అర్జున్ 21 లుక్స్ . దీంతో కొరటాల మళ్లీ అడ్డంగా బుకై నెట్టింట ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు. మరి చూడాలి దీని పై ఆయన ఏమైన స్పందిస్తారా..లేదా అనేది..?