క్రికెటర్స్ లైఫ్ నాశనం చేసిన షో ఇదే..?

టెలివిజన్ లో చాలా ప్రోగ్రామ్ లు టెలికాస్ట్ అవుతుంటాయి. ఎన్నెన్నో షోలు కూడా ప్రసారమవుతుంటాయి. కానీ వాటిల్లో కొన్నే పాపులర్ అవుతాయి. ఆ షో జనాలకు నచ్చి పాపులర్ అయ్యిందా..? లేదా స్టార్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన సీక్రేట్స్ బయట పెట్టి..పబ్లిసీటీ తెచ్చుకుందా..? అనేది మెనేజ్ మెంట్ కి అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు, నటుడు, హోస్ట్ అయిన కరణ్ జోహార్..గురించి మనకు తెలిసిందే..ఆల్ రౌండర్..మల్టీ టాలెంటెడ్.

రీసెంట్ గా ఆయన ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చారు. అలాంటి ఇలాంటి షాక్ కాదు ఊహించని..కోలుకోలేని షాక్ ఇచ్చారు ఆయన. ఆయన హోస్ట్ గా “కాఫీ విత్ కరణ్” అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షో దేశ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం RRR సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్-తారక్-అలియా ని వెంట పెట్టుకుని మరీ ఆ షోకి వెళ్లి తన సినిమాకి హ్యూజ్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు..సక్సెస్ అయ్యాడు. కేవలం రాజమౌళి నే కాదు చాలా మంది హీరోలు హీరోయిన్లు ఆ షోకి వెళ్లి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు..బాధపడి అవమాన పడి వచ్చిన వారు ఉన్నారు.

వాళ్లల్లో క్రికెటర్లు చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి మనం. గతంలో కే ఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా ఈ షో కారణంగా ఎదురుకున్న సమస్యలు మనకు తెలిసిందే. అయితే, తాజా కాఫీ విత్ కరణ్ షో ను ఇక పై చేయను ఆపేస్తున్న అంటూ కరణ్ ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు. “కాఫీ విత్ కరణ్ అనేది నా జీవితంలోనే కాకుండా మీ అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. సూపర్ హిట్ షో గా.. ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న షో. మరో కొద్దిరోజుల్లో ఏడో సీజన్ ను గ్రాండ్‌గా ప్రారంభం అవుతుందని అభిమానులు అంత అనుకుంటున్నారు. కానీ ఈ షో ఆపేస్తున్నం. ఇక పై ఎప్పటికి ఈ షో రానే రాదు” అంటూ పోస్ట్ రిలీ చేశారు. దీని పై కొందరు నెటిజన్స్ బాధపడుతుంటే.. మరికొందరు పీడ పోయింది..మచి పని చేశావ్ కరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest