అందం తెచ్చిన తంట..ఫ్యాట్ సర్జరీ వికటించి బుల్లితెర నటి మృతి..!!

సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం ఖచ్చితంగా ఉండాల్సిందే. అది వెండి తెర అయిన బుల్లి తెర అయినా..అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా లేకపోతే..ఎవ్వరు పట్టించుకోరు. ఇక తెర పై వాళ్ళ బొమ్మలు చూసుకోవాలనే ఇంట్రెస్ట్ తో.. బాడీని ఫిట్ గా ఉంచితేనే..మనకు అవకాశాలు వస్తాయి అనుకుని..నేటి కాలంలో నటీమణులు నానాతిప్పలు పడుతుంటారు. జీరో సైజ్ అని, ప్లాంట్ బెస్డ్ డైట్ అని, వాటర్ డైట్ అని..ఇలా రకరకాల డైటింగ్ లు చేసి ..నాజుగా కనిపించడానికి ట్రై చేస్తారు. ఇక కొన్ని సార్లు వాళ్ళ కి సాధ్యం కానప్పుడు డాక్టర్లు ఆశ్రయిస్తారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువుగా ఈ ప్లాస్టిక్ సర్జరీల పేరులు వింటున్నాం. దేవుడి ఇచ్చిన బాడీని మనకు నచ్చిన్నట్లు మార్చుకోవడానికి..ఈ ప్లాస్టిగ్ సర్జరీలు ఎల్లువుగా చేయించుకుంటున్మ్నారు. దీంతో సెలబ్రిటీలు అంతా..అందంగా కనిపించడానికి..తమ బాడీలోని లోపాని కవర్ చేయడానికి..ఈ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకుని..ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటి..ఫ్యాట్ సర్జరీ చేయించుకుంటున్న టైంలో అది వికటించి మృతిచెందింది. దీంతో టేలివిజన్ ఇండస్ట్రీ శోకశంద్రంలో మునిగి పోయింది.

క‌న్న‌డ బుల్లి తెర న‌టి చేత‌నా రాజ్ (21).. బెంగ‌ళూర్‌లో ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంటూ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించింది. చేతనారాజ్‌కు నడుము భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోయిందని.. శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించుకునేందుకు ఆమె బెంగ‌ళూర్‌లోని ప్రముఖ హాస్పిటల్ లో చేరింది. ఇక ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేస్తున్న టైంలో ఆమె ఆరోగ్యం క్షీణించడం .. ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ పేరుకుపోవ‌డంతో ఆమె మ‌ర‌ణించారు అంటూ హాస్పిటల్ వైద్యులు చెప్పుకొచ్చారు. “ఆమెను కాపాడేందుకు మేము చాలా ట్రై చేశామని..కానీ ఫ‌లితం లేక‌పోయింది” అంటూ వైద్యులు తెలిపారు. మరోక ఆస్పత్రికి తరలించే లోగా నటి చేతన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కానీ, వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటన పై పోలీసులు హాస్పిటల్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఇక చేతనా రాజ్ సబ్బు బ్రాండ్లు గీత, దోరెసాని ప్రకటనల్లో నటించిన మంచి పేరు సంపాదించుకుంది.

Share post:

Popular