ఎన్టీఆర్ నీకు స‌లాం… 5 రాష్ట్రాలు – 133 లొకేష‌న్లు – 600 రోజులు

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత బ‌ల‌మైన ఆర్మీ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌కు బ‌ల‌మైన ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ తిరుగులేని ఆర్మీ ఉంది. అస‌లు ఎన్టీఆర్‌, తార‌క్ పేరిట సోష‌ల్ మీడియాలో ఉన్న గ్రూపులు, పేజ్‌లు చూస్తేనే ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయినా.. ఎన్టీఆర్ ఆర్మీ అయినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే హంగామా చేయ‌రు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు. ఎవ‌రు అయినా క‌ష్టాల్లో ఉంటే ఆదుకుంటూ ఉంటూ ఆద‌ర్శంగా నిలుస్తుంటారు.

త‌న అభిమానుల‌కు ఎన్టీఆర్ ఇతోధికంగా సాయం చేస్తూనే ఉంటాడు. ఇక వాళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేమ‌గా చూసుకుంటూ ఉంటాడు. త‌న సినిమా ఫంక్ష‌న్ల‌కు ఎక్క‌డెక్క‌డో నుంచి వ‌చ్చే వాళ్లు తిరిగి వెళ్లేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని… మీకేదైనా అయితే తాను త‌ట్టుకోలేనని, త‌ల్లడిల్లి పోతాన‌ని చెపుతారు. ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమా టైంలో ప్ర‌తి రోజు అన్ని ప్రాంతాల‌కు చెందిన ఫ్యాన్స్‌తో గంట పాటు భేటీ అవుతూ వ‌చ్చాడు. ఈ సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు ఎన్టీఆర్ అలా చేయ‌డంతో ఫ్యాన్స్ మామూలు ఖుషీ కాలేదు.

అలాగే త‌న అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నా.. ప్ర‌మాదాల‌కు గురైనా వెంట‌నే ఆయా జిల్లాల అభిమాన సంఘాల‌ను ఎలెక్ట్ చేసి వారికి సాయం చేస్తూ ఉంటాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిరుపేదల ఆక‌లి తీర్చేందుకు నిరంత‌ర అన్న‌దానం జ‌రుగుతోంది. ఇది కంటిన్యూగా 600 రోజుల పాటు న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ – తిరుప‌తి – బెంగ‌ళూరులో మాత్ర‌మే న‌డుస్తూ వ‌చ్చింది.

అయితే ఈ సేవా కార్య‌క్ర‌మం ఇప్పుడు ఏకంగా 5 రాష్ట్రాల‌కు విస్త‌రించింది. 5 రాష్ట్రాల్లో మొత్తం 133 లొకేష‌న్ల‌లో ఎన్టీఆర్ అభిమానులు ట్ర‌స్ట్ ద్వారా 600 రోజులుగా ఆక‌లితో అల‌మ‌టిస్తోన్న నిరుపేద‌ల ఆక‌లి తీర్చుతున్నారు. తాము అభిమానులం అంటూ సోషల్ మీడియాలో డ‌బ్బాలు కొట్టుకోవ‌డ‌మో లేదా.. ఇత‌ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే విషం క‌క్క‌డ‌మో చేసే అభిమానులే ఇప్పుడు చాలా మంది ఉన్నారు.

అయితే ఇలాంటి చ‌ర్య‌ల‌కు భిన్నంగా ఎన్టీఆర్ అభిమానులు నిరుపేదల ఆక‌లి తీర్చుతూ ప్ర‌శంస‌లు పొంద‌డం గొప్ప విష‌యం. ఇదే స్ఫూర్తిని మిగిలిన హీరోల అభిమానులు కూడా తీసుకుని త‌మ‌వంతుగా సాయం చేస్తే మ‌రి కొంత మంది నిరుపేద‌ల ఆక‌లిని తీర్చిన వారు అవుతారు.

Share post:

Popular