అందుకే ఎన్టీఆర్ సమీరా రెడ్డిని వివాహం చేసుకోలేదా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా దేశంలోనే అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న హీరోగా చలామణి అవుతున్నారు.

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో సమీరా రెడ్డి ని ప్రేమించాడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన అశోక్, నరసింహుడు చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేక పోయినా కానీ సమీరారెడ్డి, NTR ఒకరికొకరు ప్రేమించుకున్నారు అని కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు అని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ నటించిన చిత్రాలు విడుదలయ్యాయి అంటే చాలు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాల్సిందే. అలాగే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మరి ఇంతటి గొప్ప కుటుంబానికి ఎవరైనా సరే కోడలిగా అడుగు పెట్టే అవకాశాన్ని వదులుకుంటారా.. ఇక ఎవరైనా సరే అదృష్టం వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ సమీరారెడ్డి ఎందుకు ఎన్టీఆర్ ను వివాహం చేసుకోలేదు అనే విషయానికి వస్తే.. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ , సమీరా రెడ్డి మంచి స్నేహితులు..

వీరిద్దరి మధ్య స్నేహం తప్ప అంతకుమించి మరేమీ లేదు అని సమాచారం. అందుకే ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ వైరల్ గా మారిన రూమర్లను మాత్రం వీళ్లిద్దరు ఏ మాత్రం పట్టించుకోలేదని సమాచారం. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి పెళ్లి చేసుకున్నారు . ఇక సమీరారెడ్డి అక్షయ వద్దే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు.

Share post:

Popular