వారే దూరం పెంచుతున్నారు.. చిరంజీవితో గొడవల పై జీవితా సంచలన కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అవుతారో అంతే త్వరగా గొడవపడి విడిపోతారు. చిన్న చిన్న విషయాలకు తగదా పెట్టుకుని..సంవత్సరల కాలాలు తరబడి మాట్లాడుకోకుండా ఉండే హీరో, హీరోయిన్లు ఇప్పటికి ఉన్నారు. వీళ్లల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి , యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించే. వీళ్ల మధ్య జరిగిన గొడవలు చిన్నవా, పెద్దవా అనే సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ కొన్ని ఏళ్ళుగా ప్రచారం జరుగుతుంది.

రీసెంట్ గా ఈ ఇష్యూ పై రాజశేఖర్ భార్య..జివితా స్పందించారు. మనకు తెలిసిందే..ఆమె డైరెక్షన్ లో..రాజశేఖర్..”శేఖర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌ కూడా కీలక పాత్రల్లో నటించింది. దేశవ్యాప్తంగా మే 20న విడుదల అవుతున్న ఈ సినిమాని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో డైరెక్టర్‌ జీవిత రాజశేఖర్‌ మాట్లాడుతూ మెగాస్టార్ తో ఉన్న గొడవలు గురించి స్పందించారు.

ఆమె మాట్లాడుతూ..” మా మధ్య ఉన్న చిన్న గొడవలు ఎప్పుడో సర్దుమనిగిపోయాయి. కానీ, ఈ యూట్యూబ్ ఛానెల్స్ నే..ఫేక్ వారే థంబ్‌నేయిల్స్‌ పెట్టి మా మధ్య ఉన్నవి లేనివి కలిపించి ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.’ అని జీవితా రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ..” సినిమా స్టోరీ చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని. ఎవ్వరు ఊహించ్నై ట్వీస్ట్ లతో ప్రతి నిమిషం ఉత్కంఠ భరితంగా ఉంటుందని ..అందరు తప్పక చూడాల్సిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చింది జీవిత.

Share post:

Popular