వాట్ ..పవన్ మువీ..తారక్ ఫ్లాప్ సినిమా రీమేక్ నా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలతో బిజీ గా గడిపేస్తున్నారు. భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పవన్..ప్రజెంట్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో “హరిహరవీరమల్లు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత హరిష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” లైన్లో ఉంది. ఆ తరువాత సురేందర్ రెడ్డితో మరీ సినిమా..ఆ తరువాత మరో తమిళ రీమేక్ సినిమా ..ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టుకుని ఉన్నారు.

కాగా, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన లుక్స్ పట్ల పవన్ సంతృప్తి గా లేడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ స్టోరీ చెప్పినప్పుడు ఒకలా చెప్పాడని..కాస్ట్యూమ్‌స్ అంతా కూడా సరికొత్త గా ఓల్డ్ రాయల్ లుక్ వచ్చేలా డిజైన్ చేస్తారు అని చెప్పి..ఫైనల్ మూమెంట్ లో కాస్టూమ్‌స్ గురించి పట్టించుకోవడం లేదని..దాని పట్ల పవన్ డైరెక్టర్ పై గుర్రుగా ఉన్నాడని వార్తలు వినిపించాయి.

కాగా, ఇప్పుడు తెర పైకి సంచలన మ్యాటర్ లీకైంది. పవన్ నటిస్తున్న ఈ హరిహర వీరమల్లు సినిమా..తారక్ కెరీర్లోనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన శక్తి సినిమా ను పోలిన్నట్లు ఉంటుందని..ఈ సినిమాకి రీమేక్ నే పవన్ క్రిష్ సినిమా అంటూ ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. శక్తి సినిమాలో తారక్ బ్యాక్ గ్రౌండ్ లుక్స్..హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్స్ ఇంచుమించు ఒక్కే విధంగా ఉన్నాయని..చెప్పుతూ..సినిమా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలే ఈ సినిమా పై పవన్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. పైగా ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా..ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్ లో చేరాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో ఈ న్యూస్ వైరల్ అవ్వడం సినిమా కి ఎదురుదెబ్బ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Popular