సమంత పాటకు అరుదైన గుర్తింపు ..ఏకంగా గోల్డ్‌ మెడల్‌..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో ఎన్నో అధ్బుతమైన పాత్రల్లో నటించింది. ఎన్నో అవార్డులు అందుకుంది. మంచి పేరుని సంపాదించుకుంది. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసిన సమంత ..పుష్ప సినిమాతో దేశాని ఓ ఊపు ఊపేసింది. ఎవ్వరు ఊహించనంత విధంగా ఈ పాట సక్సెస్ అయ్యింది. చిన్న పాప దగ్గర నుండి..పండు ముసలి వాళ్ల వరకు అందరు ఈ పాట ని ఎంజాయ్ చేశారు. చంద్ర బోస్ లిరిక్స్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పాటకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఇక ఆ మ్యూజిక్ సింగర్ తన మ్యాజిక్ గొంతు తో మత్తెక్కించేసింది.

ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా ఈ పాట ఉండాల్సిందే. అంతలా ఈ పాట అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత ఎక్స్ ప్రేషన్స్ కేక. తన హాట్ అందాలతో హద్దులు దాటేయ్యడమే కాదు,, చూస్తున్న జనాలకి హీట్ పెంచేస్తుంది. పాటలో అల్లు అర్జున కాళ్ళ పై కూర్చుని వేసే స్టెప్ పాట కే హైలెట్ గా నిలిచింది. ఇక నోటి తో కర్ చీఫ్ పెట్టుకుని వేసే స్టెప్ కూడా అభిమానులకు నచ్చింది. సినిమా విజయానికి ఈ పాట బాగా హెల్ప్ అయ్యిందని చెప్పక తప్పదు.

కాగా, రీసెంట్ గా ఈ పాట పాడిన సింగర్ “ఇంద్రావతి చౌహాన్” కు గోల్డ్‌ మెడల్‌ వరించింది. ప్రముఖ డిజిటల్‌ మీడియా గ్రూప్‌ సంస్ధ బిహైండ్‌వుడ్‌ సంస్థ ఈ ఏడాది19 ఏళ్లను పూర్తి చేసుకున్న శుభ సంధర్భంగా…ఆ సంస్ధ యానివర్సరి సెలెబ్రెషన్స్‌లో భాగంగా మే 22న గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఇక ఈ ఫంక్షన్ లో ఈ ఏడాది అత్యధిక పాపులర్ అయిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్‌కు గోల్డ్‌ మెడల్స్‌ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్‌వుడ్‌ గోల్డ్‌ మెడల్‌ ప్రదానోత్సవానికి ఆమె ఎంపిక చేశారు. దీంతో ఆమె దేవిశ్రీ ప్రసాద్ కి ధ్యాంక్యూ అంటూ ట్వీట్ చేసింది. కాగా ఇంద్రావతి ప్రముఖ సింగర్‌ మంగ్లీ సోదరి అనే విషయం తెలిసిందే.

Share post:

Popular