ఆ ఫీలింగ్‌ ని ఆస్వాదించి చచ్చిపోతా..ఓరినాయనో నీ స్ట్రైట్ ఆన్సర్లకు దండాలు..!!

పోకిరి.. మహేశ్ సినిమా లో ఓ డాలాగ్ ఉంటుంది. “ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగ్గిందా లేదా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడే అదే డైలాగ్ ని కొంచెం ఛేంజ్ చేస్తూ..” ఎన్నాళ్లు బ్రతికామా అన్నది కాదు..RGV లా మగాడిలా బ్రతికామా అన్నది పాయింట్” అంటూ సోషల్ మీడియాలో కొందరు యువకులు రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ RGVది . ఈయన స్ట్రైట్ ఆన్సర్స్ కి కొందరు తిట్టుకుంటే…కొందరు మెచ్చుకుంటారు..ఒక్కరోజు అయినా ఆయన లా బ్రతకాలి అనుకుంటున్నారు.. అంత గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు RGV.

నచ్చిందే చేస్త..ఇష్టం వచ్చిన్నట్లు ఉంటా..దేశ పౌరుడిగా రాజ్యాంగంలో నాకు ఉన్న హక్కులు ఏమిటో అన్ని బాగా తెలుసు.. వాటిని వాడుకుంటున్నాను అంటున్నారు RGV. రీసెంట్ గా ఆయన ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చారు. అవి కాస్త నెట్టింట వైరల్ మారాయి. మీరు ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడేస్తుంటారు ..ట్వీట్స్ చేస్తుంటారు..ఎప్పుడైనా ఆలోచించారా..వాళ్ళు బాధపడు తారు ఏమో అని..అని అడగ్గా..RGV సమాధానమిస్తూ..” ఎదుటి వాళ్లు ఏదో అనుకుంటారని.. బాధపడతారని నేను మాట్లాడకుండా ఉంటే .. మనం అసలు లైఫ్ లో ఏం మాట్లాడలేం’ అంటూ మొహానే చెప్పుకొచ్చాడు.

ఇక పోలిటికల్ బేస్ క్వశ్చన్ అడుతూ… మీరు అన్ని విషయాలల్లో వేళు పెడుతుంటారు కదా.. భవిష్యత్తులో ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మీకు ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం వింటే నవ్వు ఆగదు. RGV మాట్లాడుతూ ..” నేను ఎన్నికల్లో నిలబడితే నాకు ఒక్క ఓటు కూడా రాదు ఆ విషయం నాకు తెలుసు.. బుద్ది ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఓటెయ్యరు”.. అంటూ కాసేపు నవ్వించేశారు. ఒక్కవేళ ఎవరైన మీపై కోపంతోనో..లేక పగతోనో మిమ్మల్ని చంపాడానికి వస్తే ఏం చేస్తారు..RGV మాట్లాడుతూ..” ఆ టైంలో ఎవ్వరైనా పారిపోతారు. కానీ నేను అలా చేయను. ఎవరైనా నన్ను చంపడానికి వస్తే.. వచ్చిన వ్యక్తి ఆ కత్తితో పొడిస్తే ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో ఆస్వాదించి..ఆ తరువాత చచ్చిపోతా” అంటూ వర్మ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు. దీంతో వర్మ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.