మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ.. సర్కారు వారి పాట డైరెక్టర్ బహిరంగ క్షమాపణలు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..అందాల ముద్దు గుమ్మ కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్ర, “సర్కారు వారి పాట”. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశూరామ్ చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చి ..తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా పై భారీ స్ధాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాటిని సక్సెస్ ఫుల్ రీచ్ అయ్యాడు పర్శూరామ్. సమ్మర్ కానుగా మే12న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజీటివ్ టాక్ పరంగా దూసుకుపోతుంది.

సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అయితే, సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కొన్ని డైలాగ్స్ పరోక్షంగా కొందరి జనాలను హర్ట్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ..సూపర్ హిట్ టాక్ తో సినిమా మెప్పించినా..ఆ డైలాగ్స్ మాత్రం అలాగే కాంట్రవర్షీయల్ గా మిగిలిపోయాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశూరామ్ వాళ్ళకి ఓపెన్ గా సారీ చెప్పారు.

సినిమా సక్సెస్ కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న ఆయన…ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడుతూ..” సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌తో పలికించిన ఒక డైలాగ్‌ చాలా మందికి ఇబ్బందిగా అనిపించిందని..ఆ డైలాగ్ వల్ల మేము కావాలని రాసింది కాదని..అనుకోకుండా అలా సింక్ అయ్యిందని..ఒక్కవేళ ఆ మాటలు ఎవ్వరికైనా.. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని” పరశురామ్‌ కొరారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటాను అని చెప్పుకొచ్చారు . కాగా, ఈయన తన తదుపరి సినిమా అక్కినేని నాగ చైతన్య తో తెరకెక్కిస్తున్నట్లు ఇది వరకే చెప్పుకొచ్చారు.

Share post:

Latest