అరెరె..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరశూరామ్..?

ఈ మధ్య కాలంలో సినిమా ను తెరకెక్కించడం కన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం గా ఉంది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా ధింక్ చేస్తూ.. సినిమాలో ని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సొషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగటం..అవి కాస్త వైరల్ గా మారడం ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొందరు ఏమో సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంటారు.

మరి కొందరు..తొక్క..అక్కడేమి లేదు ఫ్యాన్స్ హంగామ మాత్రమే..పెద్ద గా చెప్పుకొతగ్గ ఎలిమెంట్స్ లేవు అంటూ మరికొంతమంది అంటున్నారు. వీటన్నింటి మధ్య..సినిమాకి సబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అస్సలు సినిమా స్టోరీకి..మహేష్ బాబు కి ఉన్న లింక్ ఏమిటి..? విలన్ తో గొడవపడి మరి 10,000 కోట్ల విషయంలో మహేశ్ ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఏంటి..? అస్సలు మహేశ్ ఇండియాకి వచ్చింది.. కళావతి నాన్న దగ్గర నుండి..ఆమె మహేశ్ ని మోసం చేసి తీసుకున్న డబ్బు కోసం..? అది కూడా పది 10,000 డాలర్లు..అంటే 77 laksh. వచ్చిన వాడు .. ఇక్కడ తనది కాని ఓ లక్ష్యాన్ని వైపు మళ్ళించి.. హీరో నెత్తికెత్తుకుని.. అవసరం లేని విలన్ని ఢీకొడుతుంటే.. అందులో పెద్దగా చెప్పుకోతగ్గ స్టోరీ ఏముంది ..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి ఈ విషయంలో మహేశ్ ది తప్పు లేదు. ఆయన పరశూరామ్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోయాడు. ఆయన మీద అంత నమ్మకం పెట్టుకునారు మహేశ్. అవసరం లేని మ్యాటర్ లోకి మహేశ్ ని ఇరికించి.. ఆయన చేత బూతు పదాలు వాడించిన డైరెక్టర్..ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంటున్నారు నెటిజన్స్. పది వేల డాలర్ల వ్యవహారాన్ని..డైరెక్టర్..తల తోక లేకుండా.. విలన్ తో ఓ ఫోన్ యాడ్ చేసి.. హీరోని తప్పు దోవ పట్టించడం ఏమిటా అంటు అడుగుతున్నారు. పది వేల డాలర్ల నుంచి పది వేల కోట్ల అప్పు అంటూ కథను కొత్త మలుపు తిప్పడం సిల్లీగా అనిపిస్తుంది..అంటూ ఏకిపారేస్తున్నారు. సినిమాని మహేశ్ నటన కోసం మాత్రమే జనాలు చూస్తున్నారు తప్ప..ఇన్ సైడ్ అంత సీన్ లేదంటూ..డైరెక్టర్ కి చురకలంటిస్తున్నారు.