మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లమ్..చిరంజీవి కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడే..?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి గుర్తు వస్తాడు. ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు గుర్తు వస్తారు. అలాంటి ఓ మార్క్ సెట్ చేశాడు చిరు. ఇండస్ట్రీ పెద్ద దిక్కు తాను కాను అంటూ చెప్పుకుని తిరిగే చిరంజీవిని అందరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మీరే అంటున్నారు. మరి అలాంటి ఆయన ఇంట్లో ఓ సమస్య వస్తే ఖచ్చితంగా చిరు ముందు అడుగు వేసి..ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. మెగా ఫ్యామిలీలో ఏ విషయం అయిన ఆయనకు చెప్పకుండా చేయరు. అంతటి గౌరవం ఇస్తారు ఆయనకి.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీలో కొత్త సమస్య తీసుకొచ్చిన్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే..ఈ యంగ్ హీరో యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టిమిటాడి..ఫైనల్ గా ఆ దేవుడి దయ వల్ల సేఫ్ గా ఇంటి వచ్చాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న సాయి.. మళ్ళీ సినిమా షూటింగ్ లో బిజీ గా మారాడు. అయితే, ఇద్దరి కొడుకులకు పెళ్లి వయసు రావడంతో..చిరు సిస్టర్ సాయి అమ్మ..ఇంట్లో పెళ్లి గోల స్టార్ట్ చేసిందట. ఈ క్రమంలో సాయి తన లవ్ మ్యాటర్ ఓపెన్ అప్ అయ్యాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే, సాయి తేజ ప్రేమించింది ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి ని కాదట. తన క్లాస్ మెట్ నే సాయి లవ్ చేస్తున్నాట్లు మెగా కాంపౌండ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ, వాళ్లు మెగా ఫ్యామిలీకి సరిపడే రేంజ్ కాదట. దీంతో సాయి తేజ అమ్మగారు ఈ విషయంలో సంతృప్తి గా లేరని.. వేరే మంచి అమ్మాయి, మెగా ఫ్యామిలీకి తగ్గ రేంజ్ లో ఉండే అమ్మాయిని చూసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంలో అమ్మ మాట వినడం లేదట సాయి. మధ్యలో చిరు ఎంటర్ అయినా..ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేక తప్పుకునేశాడట చిరంజీవి. మరి ఈ పెళ్లి లోల్లి ఎప్పుడు క్లీయర్ అవుతుందో చూడాలి..?

Share post:

Latest