వార్నీ..”ఆచార్య‌” ని ఇలా కూడా వాడేస్తున్నావా సల్మాన్ జీ..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఫ్రెండిషిప్ లు ఎక్కువైపోయాయి. పాత శత్రువులు కూడా ఈ ప్రెండ్ షిప్ పేరుతో దగ్గరై పోతున్నారు. తద్వారా కలిసి సినిమాలు చేస్తూ…స్నేహం అంటే ఇదే రా..అంటూ సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుతున్నారు. వాళ్ళ మధ్య నిజంగా ఫ్రెండ్ షిప్ ఉందో..లేక సినిమా పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నారో వాళ్ళ కే తెలియాలి.

కాగా, ఈ మధ్య కాలంలో మనం గమనించిన్నట్లైతే ఎక్కువుగా స్టార్ సెలబ్రిటీలు వాళ్ల సినిమాలకు వీళ్ళు..వీళ్ళు సినిమాలకి వాళ్ళు..చప్పట్లు కొట్టుకుంటూ ..పొగిడేస్తూ..నానా హంగామ చేస్తున్నారు. ఇదంతా మనం టీవిల్లో చూస్తూనే ఉన్నం. కాగా, రీసెంట్ గా మరో స్టార్ హీరో..బాలీవుడ్ కండల వీరుడు..చిరంజీవిని వాడేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఇలా కాదు సర్వం వాడేస్తున్నారట.

మనకు తెలిసిందే రీసెంట్ అట్టర్ ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఆచార్య కోసం కొరటాల కోట్లు ఖర్చు చేసి ధర్మశ్ధలి సెట్ వేశారు. సినిమా ఫ్లాప్ అయినా..లోకేషన్స్ పరంగా జనాలను బాగా అకట్టుకుంది. దీంతో ఆ పాయింట్ ని బాగా క్యాచ్ చేసుకున్న సల్మాన్ ..తన తదుపరి సినిమా కోసం..ఆచార్య సెట్ ని వాడేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆచార్య సెట్ లోనే కొన్ని మార్పులు చేసి తమ కధకు తగ్గ విధంగా మాడిఫై చేస్తున్నారట. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ప్రాజెక్ట్ కభీ ఈద్ కబీ దివాళి షూటింగ్ కోసం ఈ సెట్ ని వాడుఖోనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని కోకాపేట్ ప్రాంతంలోని చిరంజీవి ప్రైవేట్ ల్యాండ్‌లో ఇదంతా జరగబోతున్నట్లు సమాచారం. మరి చూడాలి ఆచార్యకి కలిసి రాని ఈ సెట్ ..సల్మాన్ కి అయినా కలిసి వస్తుందో లేదో..?

Share post:

Popular