ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన బాలయ్య.. సక్సెస్ అవుతాడా..?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే తమ సినిమాలతో అత్యంత విజయాన్ని అందించే డైరెక్టర్లతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కొంతమంది సాన్నిహిత్యం కారణంగా ఫ్లాప్ తెచ్చుకున్న డైరెక్టర్లకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తర్వాత సినిమాల విషయంలో కూడా దూకుడు పెంచారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోని వరుసగా క్రేజీ డైరెక్టర్ కు అవకాశాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఫ్లాపుల్లో ఉన్న ఒక దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్యతో తప్ప మిగిలిన సీనియర్ హీరోలతో సినిమాలు నిర్మించి మంచి ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా బాలయ్య బాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా.. ఇక కొరటాల శివ తో పాటు క్రిష్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ డైరెక్టర్ ల కు వరుస అవకాశాలు ఇస్తున్నారు. ఒక్కోసారి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.బాలయ్య తీసుకునే ఈ నిర్ణయాల వల్ల ఒక్కోసారి అభిమానులు కూడా భయ పడిన సందర్భాలు ఉన్నాయి.

బాలయ్య బాబు మెగా ఫ్యామిలీకి చెందినటువంటి ఆహా ఓటీటీకి హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆహా ఓటీటీ ద్వారా తనను అందరికీ దగ్గరయ్యేలా చేసిన ఆ షో డైరెక్టర్ బి.వి.ఎస్.రవి కి బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆహా షో ని డైరెక్ట్ చేసిన బి.వి.ఎస్.రవి బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను రెడీ చేసారట. అంతేకాదు కథ ను బాలయ్యకు వినిపించగా ఆయన కూడా ఇంప్రెస్ అయినట్లు సమాచారం.

ఇక రచయితగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన ఈయన వాంటెడ్, జవాన్ వంటి చిత్రాలకు దర్శకుడిగా పని చేసినా పెద్దగా అలరించలేకపోయాడు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి కారణం కూడా ఆహా అన్ స్టాపబుల్ షో అని చెప్పవచ్చు. ఇక ఈ కాంబినేషన్ తో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అయినప్పటికీ సక్సెస్ అవుతాడా లేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest