“సెట్ చేద్దామని వచ్చా”..ఇండియన్ ఐడల్ లో బాలయ్య సందడి మామూలుగా లేదుగా..!!

నందమూరి నట సింహం బాలయ్య..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడే దే హీరోలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వారిలో బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఎదుటి వారు ఎంతటి వారైన సరే..తప్పు చేస్తే..ఇది తప్పు అని చెప్పే ధైత్య గల వ్యక్తి. అందుకే కాబోలు ఇండస్ట్రీలో ఆయన అంటే చాలా అమందికి గౌరవం..భయం కూడా.


కానీ, బాలయ్య లో మరో యాంగిల్ కూడా ఉంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వించేస్తారు. సరదాగా మాట్లాడుతూ..కాసేపు చిల్ చేస్తారు. ప్రజెంట్ బాలయ్య అలాంటి పనే చేసారు. మనకు తెలిసిందే, బాలయ్య రాజకీయాలు, సినిమాలే కాదు హోస్ట్ గాను మారి ఆహా వాళ్లతో కలిసి “అన్ స్టాపబుల్” అంటూ..రచ్చ రచ్చ చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ షో ద్వారానే ఆహా కి సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయి అనడంలో సందేహం లేదు. అంత బాగా బాలయ్య హోస్ట్ చేశారు.

ఇక ఇప్పుడు అదే ఆహా లో జరుగుతున్న ఫస్ట్ తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ సెమీ ఫైనల్ కి గెస్ట్ గా వెళ్ళారు. మనకు తెలిసిందే ఎక్కడ టాలెంట్ ఉన్నా ప్రోత్సహిస్తారు. తనకు చేతనైన సహాయం చేస్తారు. ఇక ఈ షో కి గెస్ట్ గా వెళ్లిన బాలయ్య..కంటెస్టెంట్లతో కాసేపు మాట్లాడి వాళ్ళ భయాని పోగొట్టారు. అంతేనా..ఆ సెట్ లో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు..జడ్జీల పై హెల్తీ పంచ్ లు వేస్తూ..తనకిష్టమైన పాటలు పాడించుకుంటూ..టెన్షన్ గా ఉన్న వాతవరణాని..సరదా గా మార్చేసారు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..” సెమీ ఫైనల్స్ కదా కంటెస్టెంట్లు షివర్ అవుతున్నారు..సెట్ చేద్దామని వచ్చా ..మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసి గెలిపించడండి” అంటూ వీడియో చెప్పుకొచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సెమి ఫినాలేకు చేరుకోవడం పట్ల టాప్ 6 కంటెస్టెంట్స్ గా నిలిచిన శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ వయసులోను బాలయ్య ఇంత ఎనర్జిటిక్ గా డ్యాన్సులు వేయడం అభిమానులను ఉత్సాహపరుస్తుంది. యంగ్ హీరోలకు ధీటుగా బాలయ్య సినిమాలకి కమిట్ అవుతూ..గట్టి కాంపీటిషన్ ఇస్తున్నాడు.

Share post:

Popular