కాళ్లు జారి పడిపోయిన సుమ..వీడియో వైరల్..!!

యాంకర్ సుమ..పేరుకి కేరళ అమ్మాయే అయినా.. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ..మన తెలుగు వాళ్ళకు బాగా దగ్గరైంది. బుల్లితెర పై సుమ యాంకరింగ్ కి తిరుగులేదు.. ఈ విషయం మనకు తెలిసిందే. ఎంతో మంది యంగ్ జనరెషన్ వాళ్లు ఎంట్రీ ఇస్తున్న సుమను ఢీ కొట్టలేకపొతున్నారు. అలాంటీ ఓ రేంజ్ సెట్ చేసుకుంది ఔమ. ఇన్నాళ్ళు బుల్లితెర పై ఓ వెలుగు వెలిగేసిన యాంకర్ సుమ కనకాల..ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి “జయమ్మ పంచాయతి ” అంటూ మన ముందుకు వచ్చేసింది.

సుమ ప్రధాన పాత్రలో వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రం “జయమ్మ పంచాయతి”. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న థియేటర్స్‌లో విడుదలైన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ..ఒక్కసారి ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తూ చూడచ్చు. సో.. సుమ సిల్వర్ స్క్రీన్ పై మొదటి హిట్ కొట్టిందనే చెప్పాలి. నిజానికి ఈ సినిమా ని చాలా మంది స్టార్ హూరోస్ సపోర్ట్ చేశారు. నాగార్జున,నాని,చరణ్, పవన్ కళ్యాణ్..ఇలా బోలెడు మంది స్టార్స్ ఆమె సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చారు.

అయితే, సినిమా షూటింగ్ టైంలో సుమ ఓ పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. ఇదే విషయాని సుమ అభిమానులకు చెప్పుకొస్తూ ఓ వీడియో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఒక్కసారిగా అభిమానుల గుండే ఝల్లుమంది . జయమ్మ పంచాయతి షూటింగ్ టైంలో సుమ ఆ షాట్ కోసం కొండ ఎక్కి ఉంటుంది. ఈ క్రమంలో అక్కడే నీళ్లు ఉన్నాయి. అప్పటి వరకు జాగ్రత్త గానే ఉన్న సుమ..ఒక్కసారిగా జారీ క్రింద పడిపోయింది.”..ఇదే వీడియోని సుమ షేర్ చేస్తూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీంతో అభిమానులు కంగారు పదుతూ..ఆమెకి మెసేజ్లు చేస్తున్నారు. జాగ్రత్త సుమ..అంటూ కొందరు పెడితే.. నీకు ఏమైన అయితే.. సినీ ఇండస్ట్రీ లో ఈవెంట్లు ఎవ్వరు చేస్తారు అక్క..అంటూ ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా కోసం సుమ బాగానే కష్టపడిందని తెలుస్తుంది.

Share post:

Latest