యాంకర్ల‌నే మించిపోయేలా బిత్తిరి సత్తి రెమ్యున‌రేష‌న్‌…!

తెలుగు రాష్ట్రాల లోని ప్రజలకు బిత్తిరి సత్తి అనే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియా న్యూస్ ఛానళ్లలో సరదా సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉండేవారు. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు కొంతమంది నటీనటుల ఇంటర్వ్యూలు చేస్తూ వారిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలు పెట్టాడు బిత్తిరి సత్తి.. దాని ద్వారా ఎన్నో వీడియో లను చేసిన విషయం అందరికీ తెలిసిందే.

మామూలుగా బిత్తిరి సత్తి అనే పేరు వినగానే ఎంతో మందికి తీన్మార్ వార్తలు గుర్తుకు వస్తూ ఉంటాయి. తన బాడీ లాంగ్వేజ్ తో తెలంగాణ యాసతో అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు బిత్తిరిసత్తి. అలా అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు బిత్తిరి సత్తి. అలా ఉన్న పాపులారిటీ తోనే టెలివిజన్ రంగం వైపు కూడా అడుగుపెట్టాడు.

కేవలం తన కామెడీతో మాత్రమే కాకుండా.. పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అదేవిధంగా మిమిక్రీ కూడా ఎంతో అద్భుతంగా చేయగలరు బిత్తిరి సత్తి. ప్రస్తుతం బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ను బట్టి నెలకి రూ.5 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్ యాడ్స్ కోసం బిత్తిరి సత్తి ఒక్క రోజుకు రూ.6 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్న వారిలో యాంకర్ సుమ కూడా ఒకరు. అయితే యాంకర్ సుమ ప్రత్యేకంగా సినిమాలు ఇంటర్వ్యూల కోసం.. రెండు లక్షల రూపాయల వరకు తీసుకుంటూ ఉండేది.. ఇక బిత్తిరి సత్తి కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నారు. కానీ బిత్తిరి సత్తి సుమ కంటే ఎక్కువ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.

Share post:

Popular