వట సావిత్రి వ్రతం చేసిన అనసూయ..కారణం అదేనా?

జబర్ధస్త్ యాంకర్ అనసూయ..ఈ పేరు చెప్పగానే అందరికి ముందు గుర్తు వచ్చేది..ఆమె అందం . హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం. ఇద్దరు పిల్లలు పుట్టిన మంచి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ…. నేటి తరం కుర్ర యాంకర్లకి గట్టి పోటీ ఇస్తుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే..మరో వైపు సినిమాలకి కమిట్ అవుతూ..రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. మనకు తెలిసిందే అనసూయ ఎంత అందంగా ఉంటుందో..అంతకంటే స్ట్రైట్ ఫార్వాడ్ గా మాట్లాడుతుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆమె స్వభావం.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ..రీసెంట్ గా ఓ వ్రతం చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట పోస్ట్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ రీసెంట్ గా వటసావిత్రి వ్రతం చేసిన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ వ్రతం భార్యలు భర్త హ్యాపీ గా ఉండాలని, ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని..భార్యలు మూడు రోజులు కఠిక ఉపవాసంతో ఈ వ్రతాని ఆచరిస్తారట.

ఈ క్రమంలోనే అనసూయ తన భర్త భరద్వాజ్ కోసం మూడు రోజులు ఎంతో నియమ నిష్టలతో ఈ పూజా చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ వ్రతానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ విషయం బయట పడింది. పూజ అయిపోయాక అనసూయ..తన భర్త పాదాలకి నమస్కరించడం మనం పిక్స్ లో చూడవచ్చు. దీంతో ఎప్పుడు చిట్టి పొట్టి బట్టలు వేసుకునే అనసూయ..ఇలా పద్ధతిగా ట్రేడిషనల్ గా భర్త కోసం పూజ చేయడం తో అభిమానులు ఫిదా అయ్యారు. నువ్వు, భరద్వాజ్ ఎప్పుడు ఇలానే ఉండండి..నైస్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ పూజ పౌర్ణమి నాడు చేయాలి..అంటే జూన్ 14న ఈ పూజా చేసుకోవాలి. కానీ, అనసూయ ఎందుకు ఇంత త్వరగా చేసిందా అని అందరు డౌట్ పడుతున్నారు . అనసూయ ముందుగానే సావిత్రి వ్రతం చేయడంతో పలువురు ఇలా ముందుగానే వటసావిత్రి వ్రతం చేయడానికి కారణం ఏంటో అంటూ ఆరా తీస్తున్నారు.

Share post:

Popular