వావ్: ఆ హీరోకి బన్నీ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌.. అద్దిరిపోలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ..బన్నీ-సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్, గోపీచంద్-ప్రభాస్, రాజమౌళి-తారక్. ఇలా మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ కు విలువ ఇచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, కొందరు హీరో లు మాత్రం అతి తక్కువ టైంలోనే..విడతీయ్యరాని అంత క్లోజ్ గా కలిసిపోయారు. అలాంటి వాళ్లల్లో అల్లు అర్జున్-నవదీప్ కూడా ఒకరు. వీళ్ళు కలిసి చేసింది రెండు అంటే రెండు సినిమాలే..కానీ ఫ్రెండ్ షిప్ బాండ్ ఫెవికల్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆర్య 2 సినిమా టైంలో స్టార్ట్ అయ్యిన వీళ్ల ఫ్రెండ్ షిప్..ఇప్పటికి ఎంతో హెల్తీ మిస్ అండర్ స్టాండింగ్స్ లేకుండా..కొనసాగుతుంది. అల వైకుంఠపురంలో సినిమాలో కూడా నవదీప్ ఓ రోల్ లో కనిపించి మెప్పించాడు. నిజానికి డైరెక్టర్ కి చెప్పి..బన్నీ నే అయ్యనకు ఆ అవకాశం ఇప్పించిన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కాగా, రీసెంట్ గా అల్లు అర్జున్..హీరో నవదీప్ కి ఓ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ పంపించారు. అది చూసి సర్ ప్రైజ్ అయిన నవదీప్..సోషల్ మీడియా వేదికగా తన హ్యాపి నెస్ అభిమానులతో పంచుకున్నారు.

పాన్ ఇండియా హీరో సర్ ప్రైజ్ గిఫ్ట్ అద్దిరి పోయింది అంటూ..తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చాడు. ఈ మేరకు ఆయన స్టోరీలో..”ప్రేమకు హద్దులు లేవు. అకేషన్‌ లేకుండానే ఇలా గిఫ్ట్స్‌ వస్తుంటాయి. థ్యాంక్స్‌ బావ(అల్లు అర్జున్). ఏది ఏమైనా ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడ‌తాను” అంటూ తనదైన స్టైల్ లో నవదీప్‌ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే, ఏ సంధర్భం లేకుండా బన్నీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడు..వీళ్ళు కలిసి మళ్లీ సినిమాలో నటిస్తున్నారా..అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రజెంట్ నవదీప్ క్రేజ్ తగ్గిపోయిన సంగతి తెలిసిందే.

Share post:

Latest