నయన్-విగ్నేశ్ పెళ్లి కార్డ్ చూశారా..భళే ట్వీస్ట్ ఇచ్చారే..!!

కోలీవుడ్ లవ్ బార్డ్స్ నయనతార-విగ్నేశ్ శివన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముందు నుండి నయన్ కి ప్రేమ కలిసి రాకపోవడంతో..ఇది కూడా ఫ్లాప్ అవుతుందిలే అనుకున్నారంతా. మనకు తెలిసిందే నయనతార..విగ్నేశ్ కంటే ముందే.. కొందరు స్టార్ హీరోలతో ప్రేమలో మునిగి తేలింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

దీంతో , ఇక పై నయన తార జీవితంలో ఏ అబ్బాయిని నమ్మదు అనుకుంటున్న టైంలోనే.. అమ్మడు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో లవ్ లో పడ్డింది. చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేసినా..ఫైనల్ గా మీడియా నుండి తప్పించుకుపోయారు. నిండా మునిగిన వాళ్ల చలి ఏముంది అన్నట్లు..అంతా తెలిసిపోయాక దాపరికం ఏముంది అనుకుంటూ..ఇక పబ్లిక్ గానే చేతిలో చెయ్యి వేసుకుని..హగ్గులు చేసుకుంటూ..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

ఇక ఎట్టకేలకు ఈ జంట పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుండి వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా వీళ్ల పెళ్లి కార్డ్ బయటపడింది. నిన్న మొన్నతి వరకు వీళ్ల పెళ్లి తిరుపతి అనుకున్న వాళ్లకు షాకిచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్న నయన్ విగ్నేశ్ డిజిటల్‌ పెళ్లి కార్డుని బట్టి వీళ్ల పెళ్ళి తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్‌ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌’ని కూడా పంపించారట. ఆ వీడియో ఇన్విటేషన్‌ వైరల్‌గా మారింది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా..పెళ్లి మాత్రం సరికొత్త పద్ధతిలో చేసుకోబోతున్నారట వీళ్లు..దీంతో అప్పుడే కాబోయే కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పుతున్నారు అభిమానులు.

Share post:

Latest