యాంకర్ చేసిన పనికి..లైవ్ లోనే ఏడ్చేసిన కృతి..ఫ్యాన్స్ ఫైర్..!!

కృతి శెట్టి..ఓ అందాల బొమ్మ. ముట్టుకుంతే కందిపోతుంది ఏమో అన్నంత అందం ఆమె సొంతం. పేరుకి కన్నడ బ్యూటీనే అయినా..చూడటానికి చాలా చక్కగా..అచ్చం తెలుగింటి అమ్మాయి లా..కుందనపు బొమ్మల ఉంటుంది. కృతి శెట్టి హీరోయిన్ గా ఎంటర్ అవ్వక ముందే ..కొన్ని యాడ్స్ లో నటించి స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన సినిమాతో అమ్మడు లక్ మారిపోయింది.

ఈ సినిమా తరువాత వైష్ణవ్ కంటే..ఆమెకే సినిమా ఆఫర్లు ఎక్కువుగా వస్తున్నాయి. అంతేనా కృతి హ్యాట్రిక్ హిట్లు కొట్టి..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. కోలీవుడ్ లోను కాళ్లు మోపి మంచి మంచి ఆఫర్లు పట్టేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో కూడా ఆఫర్ అందుకుంది. ప్రజెంట్ ఆమె ది వారియర్ అనే సినిమాలో రామ్ సరసన నటించింది. ఈ సినిమా జూలై 14న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినీ మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే కృతి శెట్టి బిహైండ్ వుడ్స్ యూట్యూబ్ ఛానల్ కు ఓ ఇంటర్వ్యుల్లో ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యుల్లో యాంకర్స్ ఆమెను ప్రాంక్ పేరుతో కాసేపు బెదరకొట్టేశారు. ప్రాంక్ స్టర్స్ అయిన ఆశిక్, సారథిరన్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ..మధ్యలో కాస్త ఓవర్ యాక్టింగ్ చేసి..గట్టిగా అరుచుకుంటూ..గొడవ పడుతున్నత్ళు సీన్ క్రీయేట్ చేశారు. దీంతో సున్నిత మనస్తత్త్వం గల కృతి..బాగా భయపడిపోయింది. అంతేనా..టెన్షన్ పడి..ఒళ్ళంత చెమటలు పట్టేశాయి. ఇది గమనించిన యాంకర్స్..కూల్ కూల్ఇది ప్రాంక్ అంటూ..ఓపెన్ అప్ అయిపోయారు. ఇక అప్పుడు కృతి ఆ భయాని, అలా అరిచేశారు అన్న బాధని కంట్రోల్ చేసుకోలేక ..లైవ్ లోనే ఏడ్చేసింది. కాసేపు అమ్మడిని కూల్ చేసే పనిలో పడిపోయారు అక్కడున్న వారు. ఇక కృతి సెట్ అయ్యాక..ఆమె మాట్లాడుతూ..” నాకు ఇలా ఎవ్వరైనా అరిచినా..గట్టి మాట్లాడినా..నచ్చదు..భయమేస్తుంది..ఏడుపువస్తుంది”..అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలా కృతి ని ఏడిపించడం పై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Share post:

Popular