45 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోని సుబ్బ‌రాజు… రీజ‌న్ ఇదే..!

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీరీలో సుబ్బరాజు కూడా ఒకరు. ఈయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. సుబ్బరాజు ఇప్పటివరకు కామెడీ, విలన్, సీరియస్ పాత్రలో కూడా నటించి మెప్పించారు. ఏ పాత్ర అయినా కూడా ఈయన అందులో ఒదిగిపోయి మరి నటించి ఆ పాత్రలకు ప్రాణం పోస్తూ ఉంటారు సుబ్బరాజు. ఇక మిర్చి సినిమాలో, బాహుబలి సినిమాలో ఆయన క్యారెక్టర్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

మిర్చి సినిమా ముందు వరకూ ఆయన పాత్రలు అన్నీ విలన్ పాత్రలే అని చెప్పవచ్చు. అయితే ఇలా సుబ్బరాజు తెరమీద చేసే పాత్రలు గురించి అందరికీ తెలిసిందే . కానీ తన జీవితం గురించి బయటకు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. నటుడిగా ఈ స్టేజ్లో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు.. ప్రస్తుతం ఈయన వయసు 45 సంవత్సరాలు అయినా కూడా వివాహం చేసుకోలేదు అనే విషయం చాలా మందికి తెలియదు.

ఇంత వయసు వచ్చినా సరే వివాహం ఎందుకు చేసుకోలేదు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే ప్రశ్న ఆయనను అడిగితే ఆయన ఒక సమాధానం తెలియజేశారు. సుబ్బరాజు మాట్లాడుతూ .. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదని.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఉండదని.. అసలు తనకు వివాహమే అవసరం లేదనే విధంగా కామెంట్ కూడా చేశారు.. పెళ్ళి జరగడం వేరు .. చేసుకోవడం వేరనే విషయాన్ని కూడా తెలియజేశారు.

పెళ్ళి జరగడం అంటే అది కేవలం పెద్దల కోసం బలవంతంగా చేసుకోవడమేనని.. పెద్దల కోసం ఇబ్బందిపడుతూ చేసుకోవాల్సిన పని తనకు లేదని.. వివాహం అంటే ఇష్టం ఉన్నప్పుడే వివాహం చేసుకుంటానని సుబ్బరాజు తెలియజేశారు. దీంతో ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరి ఈ నటుడు ఎప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి మరి.

Share post:

Popular