మహేష్ మిస్ చేసుకున్న 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే..?

మాములుగా సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు మొదట ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలు వివిధ కారణాలతో మరొక హీరోతో తెరకెక్కిస్తూ ఉంటారు. ఇలా చాలానే జరిగాయి… అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఏ విధంగా 7 సూపర్ హిట్ సినిమాలను చేయకుండా తప్పుకున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటే.. సర్కారు వారి పాట సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు.

గజినీ

తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ ఏ ఓర మురుగదాస్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ చిత్రం గజినీ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఓన్ చేసుకున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య హీరోగా మరియు ఆసిన్ హీరోయిన్ గా నటించి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా మొదటగా మహేష్ బాబు ను అనుకున్నాడట మురుగదాస్. అయితే అదే టైం లో మహేష్ బాబు వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆ ఛాన్స్ కాస్త సూర్యను వరించింది.

వర్షం

ప్రభాస్ కెరీర్ లో వర్షం సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇటు యువతను ఆకట్టుకుని కలెక్షన్ ల ప్రభంజనం సృష్టించింది. మొదట ఈ సినిమా కూడా మహేష్ వద్దకు చేరిందట. అపుడు కూడా మహేష్ బిజీ షెడ్యూల్ లో ఉన్నందు వలన మళ్ళీ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

24

సూర్య ట్రిపుల్ రోల్ చేసిన మరో సూపర్ హిట్ చిత్రం 24… అయితే ఈ కథ కొత్తగా ఉండడంతో మహేష్ బాబు ఈ సినిమాకు నో చెప్పాడట. కానీ ఇది విమర్శకుల ప్రసంశలు సైతం అందుకుంది. ఇందులో సూర్య సరసన నిత్యామీనన్ మరియు సమంతలు నటించి మెప్పించారు.

ఏ మాయ చేశావే

ఏమాయ చేశావే గురించి ఎవ్వరినీ అడిగినా కథలు కథలుగా చెబుతారు. అంతలా ఇది యూత్ ను ఆకట్టుకుంది. ఇందులో జెస్సీ కార్తీక్ ల పాత్రలలో సమంత మరియు నాగచైతన్యలు జీవించేశారు. గౌతమ్ మీనన్ తెరేక్కించిన అందమైన ప్రేమకథగా అలరించింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ను సంప్రదిస్తే.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో కుదరలేదు.

అ ఆ

నితిన్, త్రివిక్రమ్ మరియు సమంతల కాంబోలో వచ్చిన చిత్రం అ ఆ. కానీ మొదట ఈ సినిమాను మొదట మహేష్ తో తీయాలని అనుకుని కథ చెప్పగా… అయన ఒప్పుకోలేదు.. ఆ తర్వాత నితిన్ తీసి సూపర్ హిట్ కొట్టాడు మతాల మాంత్రికుడు.

లీడర్
శేఖర్ కమ్మల నుండి వచ్చిన మరో గుడ్ మెస్సేజ్ ఫిలిం లీడర్. అప్పటి రాజకీయాలకు వస్తావా రూపం ఇదని చెప్పవచ్చు. ఈ సినిమాతోనే రానా తన కెరీర్ ను ప్రారంభించాడు. అయితే మొదట శేఖర్ ఈ సినిమా కోసం మహేష్ ను కాంటాక్ట్ అయ్యాడు. కానీ మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉండడంతో వదులుకున్నాడు.

పుష్ప

ఇక లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప ఎంత హిట్… అందరూ ఇందులో పాట్లను స్టెప్ లను వాడేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మొదట మహేష్ ను అనుకుంటే… మహేష్ మాత్రం నాకు మాస్ సూట్ కాదు అంటూ కొట్టిపడేశాడు. దానితో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. మాస్ లో ఉన్న కిక్ ను పరిచయం చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

Share post:

Latest