ప్లాస్టిక్ సర్జరీ లతో రూపురేఖలు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి ఏదైనా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లు అయితే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీల మీద ఆధారపడుతుంటారు. హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా ఇలా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జూనియర్ ఎన్టీఆర్ మంచు విష్ణు లావు తగ్గడానికి ఏకంగా సర్జరీల మీద ఆధారపడ్డారట. ప్రత్యేకమైన సర్జరీలు ఛేసుకుని ఇక పూర్తిగా లావు తగ్గి పోయి సన్నబడ్డారట. అయితే వీళ్ళు సన్నబడి ఒక షేప్ లోకి రావడానికి అటు జిమ్లో వర్కవుట్ కూడా ఉపయోగపడ్డాయ్ అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరుత టైం లో ఉన్న దానికి ఇక ప్రస్తుతం ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది. లిప్స్ కూడా పలుమార్లు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ సైతం అటు గంగోత్రి సినిమాలో ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి చాల చేంజ్ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ తన లిప్స్ తో పాటు మరిన్ని సర్జరీలు కూడా చేసుకున్నారట.

60 ఏళ్ళు వచ్చినా ఇంకా నాగార్జున మన్మధుడు గా ఉన్నాడు అంటే కేవలం వర్కౌట్స్ మాత్రమే కారణం అనుకుంటారు అందరూ. కానీ ఒక ప్రత్యేకమైన సర్జరీ చేయించుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది అని ఇండస్ట్రీ టాక్. అందుకే ముడతలు లేకుండా నాగ్ ఎప్పుడు హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా బొటాక్స్ ఇంజక్షన్ ని తన ఫేస్ మీద గడ్డం మీద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రి ఎంట్రీ తర్వాత మెగాస్టార్ ఎంత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా ఒక సర్జరీతో మరింత యంగ్ లోకి మారిపోయాడు. 50 దాటిపోతున్న 30 ఏళ్ల కుర్రాడిలా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నాడట.

మాస్ మహారాజా రవితేజ సైతం ఈజీ అండ్ సింపుల్ గా ఉండడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని బొటాక్స్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నాడట. ఇలా మనకు ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే హీరోలందరూ ఒకప్పుడు సర్జరీలు చేసుకుని అందాన్ని పంచుకున్న వారు కావడం గమనార్హం.

Share post:

Latest