అయ్యయ్యో అల్లు అరవింద్ కు ఎంత కష్టం వచ్చింది ..?

సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్..రేంజ్..పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు రామలింగయ్య అలాంటి పేరుని గౌరవాని సంపాదించిపెట్టి వెళ్లారు. ఇక దాని ఏ మాత్రం చెడిపోనీవ్వకుండా అల్లు అరవింద్..కొనసాగిస్తూ వస్తున్నాడు. అల్లు అరవింద్ మంచి నటుడి తో పాటు నిర్మాత కూడా అన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమాలతో నవ్వించిన ఈయన..ఇప్పుడు సినిమాలు నిర్మించి మెప్పిస్తున్నాడు.

అల్లు అరవింద్ నటుడిగా కన్నా కూడా నిర్మాత గానే మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన లాస్ట్ ప్రోడ్యూస్ చేసిన రెండు సినిమాలు తప్పిస్తే..అంతక ముందు వచ్చిన అన్ని సినిమా బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశాయి. కధను బట్టి సినిమా హిట్టా..ఫట్టా అని చెప్పే సత్తా ఉన్న ప్రోడ్యూసర్ అరవింద్. అలా చాలా సినిమాలల్లో తన టాలెంట్ తో గ్రహించి..ఫ్లాప్ సినిమాల నష్టాల నుండి తప్పించుకుని..భారీ విజయాలు..అంతకన్నా భారీ స్దాయిలో లాభాలు వచ్చే సినిమాలని ప్రోడ్యూస్ చేసి లాభ పడ్డారు అల్లు అరవింద్.

అయితే, పాపం ఆయన టైం బాగాలేన్నట్లు ఉంది. రీసెంట్ గా ఆయన ప్రోడ్యూస్ చేసి రిలీజ్ చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే పరమ చెత్త సినిమాలుగా రికార్డ్ నమోదు చేశాయి. వరుణ్ తేజ్ తో గని సినిమా ను ప్రోడ్యూస్ చేసిన అరవింద్ ..దాదాపు ఈ సినిమా కోసం మూడేళ్ళు కష్టపడ్డారు. కానీ ఏం లాభం ఓల్డ్ కంటెంట్..పైగా జనాలకు ఎక్కలేదు..దీంతో ఫ్లాప్ అయ్యింది. నష్టాలు వచ్చాయి. ఇక అదే తరహాలో బాలీవుడ్ లో జెర్సీ సినిమాను ప్రోడ్యూస్ చేశాడు..సినిమా బాగున్నా.. KGF 2 దెబ్బకు..అడ్రెస్ లేకుండా పోయింది. దీని ద్వారా కూడా అల్లు అరవింద్ చాలా నష్ట పోయిన్నట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. పాపం ..ఇలా ఆశ పెట్టుకున్న రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి ..దీంతో అరవింద్ డిలా పడిపోయిన్నట్లు టాక్ వినిపిస్తుంది.

Share post:

Popular