సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు బాగా న‌చ్చిన సినిమా అదే.. కానీ.. అదో పెద్ద అట్ట‌ర్ ఫ్లాప్‌…!

సీనియ‌ర్ మోస్ట్ న‌టుడు.. తెలుగు వారి ఆత్మ‌బంధువు.. అన్న ఎన్టీఆర్ న‌టించిన చిత్ర‌లు వంద‌ల్లో ఉన్నాయి. సాధార‌ణంగా అన్న‌గారు న‌టించిన చిత్రాల‌లో అంద‌రికీ అన్ని న‌చ్చిన చిత్రాలే. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి విభేదాలు లేవు. ఆయ‌న రౌడీగా న‌టించినా.. రాముడుగా న‌టించినా.. పిచ్చి పుల్ల‌య్య‌గా న‌టించినా.. ఉపాద్యాయుడిగా యాక్ట్ చేసినా.. ప్ర‌తి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఇవ‌న్నీ ప్ర‌జ‌లు ఆద‌రించి.. నెత్తిన పెట్టుకున్న సినిమాలే. అయితే.. మ‌రి అన్న‌గారికి న‌చ్చిన సినిమా ఏది? అంటే.. మాత్రం చెప్ప‌డం క‌ష్టం.

ఆదిలో ఆయ‌న‌కు పిచ్చిపుల్ల‌య్య బాగా న‌చ్చింది. త‌ర్వాత‌.. అన్న‌గారే తీసుకున్నశ్రీకృష్ణ పాండవీయం న‌చ్చింది. ఇలా.. అన్న‌గారి టేస్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోయింది. అయితే.. ఎప్పుడు ఎలా మారినా.. అన్న‌గారికి చారిత్ర‌క నేప‌త్యం ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. వాటికోసం.. అన్న‌గారు ఎంతో క‌ష్ట‌ప‌డే వారు. ఇలా న‌టించిన చిత్రాల‌ను ఆయ‌న త‌న హిస్ట‌రీ ఆఫ్ ఎన్టీఆర్ అనే పుస్త‌కంలో రాసుకున్నారు. ఇలా.. రాసుకున్న చిత్రం.. శ్రీ నాథ క‌విసార్వ‌భౌమ‌. ఈ సినిమాను.. బాపు ద‌ర్శ‌కత్వంలో తీశారు. ఈ సినిమా పూర్తిగా మ‌హాక‌వి .. శ్రీనాధుడికి సంబంధించిన జీవితాల‌ను గుదిగుచ్చి రాసిన‌.. క‌థ‌.

ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కేవ‌లం అన్న‌గారు శ్రీనాధుడిగా, జ‌య‌సుధ ఆయ‌న భార్య‌గా న‌టించారు. దీనిపై నిర్మాత‌లు పెద్ద ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. అన్న‌గారు న‌టించిన అనేక పౌరాణిక చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యాయి. పైగా.. ప్ర‌సిద్ధ ద‌ర్శ‌కులు.. బాపు, ప్ర‌సిద్ధ ర‌చ‌యిత ర‌మ‌ణల మేలు క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం కావ‌డంతో నిర్మాత‌లు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, అన్న‌గారుసైతం.. శ్రీనాధుడి చ‌రిత్ర‌ను చ‌దివిన త‌ర్వాత‌.. ఈ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆయ‌నే స్వ‌యంగా మేక‌ప్ కూడా వేసుకున్నారు.

ఇలా.. అన్న‌గారు ప్రాణం పెట్టారు కాబ‌ట్టి.. ఈ సినిమా త‌న‌కున‌చ్చిన సినిమాల్లో పెద్ద చోటు ద‌క్కించుకుంద‌ని.. అన్న‌గారే చెప్పారు. అయితే.. అనూహ్యంగా అప్ప‌టికే తెలుగు ప్రేక్ష్‌కుల నాడి మారిపోయిన నేప‌థ్యంలో ఈ సినిమా ప‌ట్టుమ‌ని 50 రోజులు కూడా ఆడ‌లేదు. దీంతో ఇది ఫ‌ట్ అయింది. ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్లిపోయింది. కానీ.. అన్న‌గారు మాత్రం తన‌కు న‌చ్చిన సినిమా అంటూ.. ప‌దే ప‌దే ఇదే సినిమా గురించి చెప్ప‌డం గ‌మ‌నార్హం.