పవన్ తన ఫస్ట్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా పేరు పొందాడు. ఇక వకీల్ సాబ్ వంటి చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను సంతోష పడేలా చేశాడు. ఇక తాజాగా భీమ్లా నాయక్ చిత్రంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఎవరైనా సరే హీరోలు సక్సెస్ కొట్టాలి అంటే కచ్చితంగా కథ పైన లేదంటే డైరెక్టర్ పైన ఆధార పడవలసి ఉంటుంది.. కానీ పవన్ కళ్యాణ్ కు అవేమీ అవసరం లేదు.

ఇక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్లు మాత్రం వసూలు చేయడం పక్క అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే నిర్మాతలు ప్రస్తుతం రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే.. అయితే ఇప్పటికి కూడా పవన్ తో సినిమా చేయాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు సైతం చాలా ఆత్రుతగా వున్నారు. కొంతమంది అయితే అడ్వాన్సు ఇచ్చి కూడా ఎన్నో సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉన్నారు.

అయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బద్రి సినిమా ఎంతటి విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఈ చిత్ర కథను కేవలం 20 నిమిషాల్లోనే విని ఏమని చెప్పారంటే.. ప్రస్తుతం ఇప్పుడైతే రూ.50 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కానీ తన మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడు అని తెలిస్తే అందరు షాక్ అవుతారు. మొదట పవన్ ని హీరోగా లాంచ్ చేసిన బాధ్యత అల్లు అరవింద్ కు అప్పగించారు..

అయితే ఈ నేపథ్యంలో ఈవీవీ సత్యనారాయణతో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా తెరకెక్కించారు. ఇందులో అలనాటి హీరోయిన్ రంభ ఐటం సాంగ్ చేయగా.. నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్ గా నటించింది. అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు కు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. మొత్తం మీద 50 వేల లోపు అప్పట్లో అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు తీసుకునే రేంజ్ కి ఎదిగిపోయాడు.