Jr. NTR – రామ్ చరణ్‌… ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఆస్థిపరులంటే…?

టాలీవుడ్ లో ఎంతమంది హిరోలున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ NTR చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ అగ్ర కుటుంబాల నుంచి వచ్చిన వారసులు. అలాగే ఇద్దరూ టాలీవుడ్లో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్నవారే. అభిమానుల విషయంలోకూడా వీరు సమానతను కలిగి ఉండడమే కాదు, అధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు కూడా వీరే. అందువలన వీరి అభిమానులు వీరి వ్యక్తిగత వివరాల కోసం ఎప్పడూ ఆసక్తి చూపుతూ వుంటారు. ఇటీవల వీరిద్దరూ RRR సినిమాలో ఓకే స్క్రీన్ షేర్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న విషయం విదితమే. ఇకపోతే ఇపుడు వీరిద్దరి ఆస్తి వివరాలు గురించి తెలుసుకుందాం.

ఫస్ట్ రామ్ చరణ్ ప్రాపెర్టీస్ విషయానికొస్తే, ఇతగాడికి కార్లు అంటే చాలా ఇష్టం. తన గ్యారేజ్ లో ఉన్న కార్ లిస్ట్ పెద్దదే. ‘ఆస్టన్ మార్టిన్ వాంటేజ్’ కార్లను తరచూ వినియోగిస్తూ ఉంటాడు. ఈ కార్ మన మెగాస్టార్ కనుక అని సమాచారం. ఇంకా రామ్ చరణ్ వద్ద 3.34 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్, 3.5 కోట్ల విలువచేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ అలాగే మెర్సిడెస్-బెంజ్ gls350d , SUV కూడా రాంచరణ్ గ్యారేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లో ఈ మధ్య ఒక విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు. దీని విలువ అక్షరాలా రూ. 30 కోట్ల పైమాటే. అలా మొత్తంగా చూసుకుంటే, మన రామ్ చరణ్ ఆస్తి దాదాపుగా రూ.1300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక Jr. NTR ఆస్తుల విషయానికొస్తే, తారక్ గ్యారేజీలో చాలా కార్లు ఇప్పటికే కొలువుదీరాయి. ఇటీవలి లంబోర్గిని యూరుస్ గ్రాఫైట్ మోడల్ కార్ ను ఆర్డర్ చేసాడు. దాంతో మన దేశంలో ఈ మోడల్ కార్ వున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు. దీని ఖరీదు అక్షరాల రూ. 3.16 కోట్లు. అవును.. వీటితో పాటు మెర్సిడెస్-బెంజ్ GLS350D, రేంజ్ రోవర్ వోగ్యూ SUV కార్లు కూడా ఈయన రేజ్ లో ఉన్నాయి.

ఫోర్స్ 718 కెమ్యాన్ గ్యారీ ధర సుమారు 85.95 లక్షలు. అలాగే రెగ్యులర్ గా వాడే బియ్యం డబ్ల్యూ ఎల్ డి కార్డు ధర రూ. 1.32 కోట్లు. 80 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జట్ కూడా తారక్ కు ఉంది. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనంతో పాటు బెంగళూరు , కర్ణాటక రాష్ట్రాల్లో లగ్జరీ భవనాలు కూడా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే 444 కోట్ల రూపాయల ఆస్తి ఉందని సమాచారం. దీన్ని బట్టి అర్ధం చేసుకోండి ఎవరికి ఎంతుందో!