తగ్గేదే లే అంటోన్న మహేష్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.

ఈ సినిమాలో ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్ ప్రధానాంశంగా మనకు చూపించనున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని వారందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరో లెవెల్‌లో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే తన సినిమాల ప్రమోషన్స్‌కు పెద్దగా ఆసక్తి చూపని మహేష్, ఈసారి తన పంథా మార్చుకుని, తానే స్వయంగా ముందుండి ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘సర్కారు వారి పాట’ చిత్రం తనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారడం.. ఈ వేసవిలో తన సినిమాతో ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేయడంమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ స్టార్ హీరో. మొత్తానికి సినిమా ప్రమోషన్స్‌లో దూకుడును చూపించేందుకు మహేష్ రెడీ కావడంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Popular