బాలకృష్ణ సినిమాలో కార్తీక దీపం వంటలక్క… ద‌శ తిరిగిపోయిందిగా…!

తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ కార్తీక దీపం వంటలక్క అంటే చాలా ఇష్టం. తెరపై తనదైన నటనతో ఎంతో ఏడిపిస్తుంది ఆమె. సీరియల్‌లో ఆమెకు వచ్చే కష్టాలు చూసి చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుంటారు. ఇక సీరియల్ టైమ్ అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన తారకు తాజా ఎపిసోడ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనే ఉత్కంఠతో ప్రతి ఎపిసోడ్‌ను కన్నార్పకుండా చూస్తుంటారు. బుల్లితెరపై ఎంతో ఫేమ్ సంపాదించిన వంటలక్క ఇక వెండితెరపై కూడా తన ప్రతిభ చాటనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇటీవల కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క పాత్ర ముగిసింది. తరువాతి జనరేషన్‌కు కథ మారడంతో ఆమె పాత్రకు సీరియల్ నిర్మాతలు తప్పించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ సీరియల్ ద్వారా వచ్చిన పేరును తన కెరీర్‌కు వాడుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో బాలయ్య సరసన ఆయన తరువాతి సినిమాలో చెల్లెలి పాత్రను పోషించడానికి ఒప్పుకుంది.

ది తన సినీ కెరీర్‌కు ఎంతో దోహదపడుతుందని ఆమె భావిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలలో తల్లి, చెల్లి పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అటువంటి సెంటిమెంట్‌లపై కూడా దర్శకులు ఇటీవల కాలంలో బాగా దృష్టిసారిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచే కాక ప్రేక్షకులందరి కళ్లల్లో కన్నీళ్లు రప్పించే ఎన్నో కీలక సన్నివేశాలు బాలకృష్ణ చిత్రాలు ఇటీవల దర్శనమిస్తున్నాయి. ఇక ప్రేమీ విశ్వనాథ్ ఆయన చెల్లెలి పాత్రలో ఎలా నటన కనబరుస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన సినీ కెరీర్‌లో 107వది. దీనిని నందమూరి అభిమానులు బాగా మెచ్చేలా దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇక సిస్టర్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో కథకు కీలకం అని తెలుస్తోంది. ఆ పాత్రకు కార్తీక దీపం ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించిన ప్రేమీ విశ్వనాథ్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది.

అప్పటికే మంచి సినిమా అవకాశం ఎదురు చూస్తున్న వంటలక్కకు తన పాత్ర గురించి వినగానే ఆమె ఓకే చెప్పేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ కూడా బాగా ఉండడంతో ఆమె అడిగినంత నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని నెలల్లో విడుదలయ్యే ఈ సినిమా ద్వారా వంటలక్క సినీ అభిమానులను కూడా తన నటన ద్వారా ఏడిపించేస్తుందని టాక్ నడుస్తోంది.

Share post:

Popular