తొమ్మిదేళ్ల తర్వాత NTR మళ్ళీ ఆయనతో సినిమా..సూపరో సూపర్ అంతే..?

ప్రజెంట్ తారక్ ఎంత బిజీగా ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ ని చేతిలో రెడీగా పెట్టుకుని ఒకదాని తరువాత ఒకటి కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్ లో రణం రౌద్రం రుధిరం అనే సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ప్రస్తుతం RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరి కొద్ది రోజులో కొరటాల శివతో కమిట్ అయిన సినిమా కోసం బాడీ లో ఛేంజస్ తీసుకొస్తున్నాడు. మనకు తెలిసిందే తారక్ సినిమాల కోసం తన బాడీని ఈజీ గా మౌల్డప్ చేసుకునేస్తాడు..బరువు తగ్గమన్నా తగ్గుతాడు..పెరగమన్నా పెరుగుతాడు.

కాగా, కొరటాల తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చి బాబు తో కాని, లేక ప్రశాంత్ నీల్ తో కాని కమిట్ అయిన సినిమాను త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు NTR. ఆ తరువాత మిగిలిన డైరెక్టర్ తో సినిమా ఫినిష్ చేసి.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడు. యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారక్ బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు అనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. ఈ సినిమాను ఫిక్స్ చేసింది దిల్ రాజునేనట.NTR తో అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ళ ముందు రామయ్య వాస్తవయ్య అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది. ఆ తరువాత ఎందుకో తెలియదు కానీ వీళ్ల కాంబో సెట్ అవ్వలేదు. మళ్లీ ఇప్పుడు 9ఏళ్ల తరువాత ఎన్టీఆర్ తో దిల్ రాజు సినిమా నిర్మించడానికి సిద్ధపడ్డారు అంటూ సినీ వర్గాలల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ తేజ్ తో RC#15 సినిమా నిర్మిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా తీయాలని ఆలోచిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. తారక్ తో అనిల్ క్రేజీ కాంబినేషన్ అనుకుంటే మధ్యలో దిల్ రాజు..ఇక సూపరో సూపర్ అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి చూడాలి దీని పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

Share post:

Popular