వాట్.. పవన్ కళ్యాణ్ సూసైడ్  చేసుకోవాలి అనుకున్నాడా..ఎందుకు..? ఎప్పుడు..? అనే ప్రశన్లు ఇప్పుడు అందరు అడుగుతున్నారు. దానికి కారణం లేకపోనూలేదు.  పంటలు సరిగా పండలేక..అర్ధిక ఇబ్బందులుతో విసిగిపోయి..ఆ బాధలు తట్టుకోలేక  ఆత్మహత్య చేసుకున్న కొంత మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ తన వంతు సహాయంగా   ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన  రైతు కుటుంబాలకు కొంత ఊరట కలిగించారు. దీంతో మరోసారి పవన్ తనకు ప్రజల పట్ల ఉండే ప్రేమను చూపించిన్నట్లైంది. ప్రజలకు సేవా చేయాలంటే   కేవలం అధికారం ఒక్కటే  ఉంటే సరిపోదు..మంచి మనసు కూడా ఉండాలంటూ జనసేనాని లు పరోక్షంగా రాజకీయ ప్రత్యర్ధులకు కౌంటర్లు విసురుతున్నారు.
కాగా, రీసెంట్ గా అనంతపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్..ప్రజలను ఉద్దేశించి  మాట్లాడుతూ..తన వాదన వినిపిస్తూనే..పక్క వాళ్లకి..తనను టార్గెట్  చేసి చూపేవారికి పగిలిపోయే ఆన్సర్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..తన జీవితానికి సంబంధించిన ఓ విషయాని భయటపెట్టారు. అది విన్న అభిమానులతో పాటు.. సామాన్య ప్రజలు కూడా షాక్ అవుతున్నారు. పవన్ కల్యాన్ బాధను భరించలేక సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నారట. ఈ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ గుండె ఆగినంత పనైంది. 
 
 అనంతపురంలో రోడ్ షో లో పవన్ మాట్లాడుతూ..” నేను సామాన్య మనిషినే..నేను  ఏనాడు కూడా  అద్భుతాలు చేస్తానని..మ్యాజిక్ లు చేసి బాధలు లేకుండా చూస్తానని  చెప్పను. ఎందుకంటే.. ఆత్మహత్య చేసుకోవాలని ఏ పరిస్థితుల్లో అనుకుంటారో.. అప్పుడు మనసు ఏం చెప్పుతుందో నాకు బాగా తెలుసు.  నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నేను  ఇంటర్ చదివే రోజుల్లో సరిగ్గా చదువుకోవట్లేదు..చదివినా బుర్రకి ఎక్కేది కాదు.. దీంతో ఏం చేయల్లో తెలియక ఆ  బాధని భరించలేక ఆత్మహత్య చేసుకుంటే మంచిది అని అనుకున్న. కానీ అది టైంలో నా అదృష్టం కొద్దీ నా అన్న నాగబాబు, మా వదినమ్మ పక్కన ఉండి నాకు మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పారు ..అలా ఆరోజు ఆత్మహత్య నుండి తప్పించుకుని..ఈనాడు  మీ ముందు ఇలా మీ పవన్ కల్యాణ్ గా నిల్చున్నాను” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో పవన్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్న మ్యాటర్  అటు రాజకీయాలోను ఇటూ సినీ ఇండస్ట్రీలోను సంచలనంగా మారింది. 
 

