ఎన్టీఆర్‌ను చూసి భ‌య‌ప‌డ్డ హీరోయిన్‌… షాకింగ్ రీజ‌న్‌…!

తెలుగు చిత్ర సీమ‌లో అన్న‌గారు ఎన్టీఆర్ స్ట‌యిలే వేరు. ఆయ‌న న‌ట‌న‌లోనేకాదు.. వ్య‌క్తిగ‌త న‌డ‌వ‌డిలో నూ.. చాలా స్ట్రిక్ట్‌. ఏ విష‌యంలో చూసినా, ఆయ‌న నుంచి నేర్చుకునేఅంశాలే ఉంటాయి తప్ప వేలు పెట్టి చూ పించే అంశాలు మాత్రం ఉండ‌వు. ఇలా.. అందుకే అన్న‌గారి జీవితం ఒక ఆద‌ర్శ‌వంత‌మైన గ్రంధంగా మా రింది. ఆయ‌న సినిమాలు చూసి నేర్చుకున్న‌వారు. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌జీవితాన్ని ద‌గ్గ‌ర‌గా ఉండి చూసి నేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటివారిలో అల‌నాటి హీరోయిన్లు కూడా ఉన్నారు.

వారిలో ఊర్వశి శార‌ద ఒక‌రు. అన్న‌గారి సినిమాల్లో చాలా వాటిలో ఆమె న‌టించారు. జ‌స్టిస్ చౌద‌రి, మేజ‌ర్ చంద్ర‌కాంత్‌.. స‌హా.. అనేక సినిమాల్లో అన్న‌గారితో న‌టించారు. అన్న‌గారి డైలాగుల‌తో పోటీ ప‌డి.. శార‌ద డైలాగులు రాయించుకునేవార‌ని టాలీవుడ్‌లో ప్రచారంలో ఉంది. దీంతో ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ అలాంటి శార‌ద‌.. సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో అన్న‌గారి డిసిప్లిన్‌.. ఆయన వ్య‌వ‌హారం.. సెట్స్‌కు టైం అంటే.. టైముకు వ‌చ్చేయ‌డం.. వంటివి చూసి.. భ‌య‌ప‌డేద‌ట‌.

ఎందుకంటే.. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే.. శార‌ద కూడా ఒకింత ఆల‌స్యంగానే సెట్స్‌కు వ‌చ్చే వారు.. దీంతో అన్న‌గారి డిసిప్లిన్‌ను అందుకునేందుకుఒకింత క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చేద‌ట‌. దీంతో ముందు ఎప్పుడు అన్న‌గారు సెట్స్ కు వ‌చ్చేసినా.. “శార‌ద‌గారు ఆల‌స్యాన్ని స‌హించ‌ర‌ని మేం విన్నాం.“ అంటూ.. అన్న‌గారు అనేసి.. మౌనంగా ఉండేవార‌ట‌. దీనికి శార‌ద స‌మాధానం చెప్పుకోలేక‌.. అన్న‌గారి వాద‌న‌ను కాద‌న‌లేక‌.. మ‌రుస‌టి రోజు నుంచి స‌మ‌యానికి వ‌చ్చేయ‌డం అల‌వాటు చేసుకున్నార‌ట‌. ఇలా.. అన్న‌గారిని చూసి మొద‌ట్లో భ‌య‌ప‌డినా.. త‌ర్వాత‌.. డిసిప్లిన్ బాగా ఒంట‌బ‌ట్టింద‌ని.. చెప్పుకొచ్చారు శార‌ద‌.

Share post:

Popular