వావ్: నాటు-నాటు పాటకు రాజమౌళి స్టెప్పులు.. వీడియో వైరల్‌..!!

యస్.. దర్శక ధీరుడు రాజమౌళి డ్యాన్స్ చేసారు. అది కూడా అయన డైరెక్ట్ చేసిన సినిమాలోని హిట్ సాంగ్..కోట్లాది మంది ప్రజలు ఇష్టపడే సాంగ్. మనకు తెలిసిందే..రాజమౌళి దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు తేడాలేకుండా ఆయన కష్టపడుతూ..చిత్ర యూనిట్ ని కష్టపెడుతూ..ఫైనల్ గా తను అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కించి..రిలీజ్ చేసి..ఇండియన్ బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాశాడు. కని విని ఎరుగని సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ..భారి విజయాని నమోదు చేసుకుంది ఈ RRR సినిమా.

ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత కష్టపడ్డారో..సినిమా కంటే డబుల్ స్దాయిలో ప్రమోషన్స్ కోసం కష్టపడ్డారు. పాన్ ఇండియా మూవీ కావడంతో..అన్నీ భాషలు కవర్ చేస్తూ సినిమాకి మరింత బజ్ క్రియేట్ చేసారు. ఈ క్రమంలోనే డైనమిక్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో ఓ ఇంటర్వు చేశారు. అందులో మాటల సంధర్భంలో..RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాజమౌళి ఈ సినిమాలోని నాటూ నాటు పాటకి స్టెప్స్ వేయాలి అంటూ ప్రామిస్ చేయించుకున్నాడు తారక్. కాగా, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు జక్కన్న.

మనకు తెలిసందే RRR సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. లాభాలు కూడా బాగానే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ.100 కోట్లకు పైగా వసూళు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సంధర్భంగా నైజాం పంపిణీదారుడు, నిర్మాత దిల్‌ రాజు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’టీమ్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ పార్టీకీ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళితో పాటు పలువు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తారక్ ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ ఫిల్ చేస్తూ యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో కలిసి రాజమౌళి నాటు నాటు పాటకి స్టెప్పులేశాడు. దీంతో అక్కడున్న వారంత విజిల్స్ వేసి..క్లాప్స్ కొట్టి..జక్కన్న డ్యాన్స్ ని పొగిడేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జక్కన్న డ్యాన్స్ చేసిన వీడియోను మీరు ఓ లుక్కేయ్యండి.

Share post:

Latest