ఆ హీరో నాతో అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ ఎక్కడ చూసిన ఒక్కటే జపం..RRR. దర్శకధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రణం రౌద్రం రుధిరం సినిమా మార్చి 25 న రిలీజై బాక్స్ రికార్డులను షేక్ చేస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఇప్పటి వరకు ఉన్న అన్నీ పాత సినిమాల రికార్డలను చెరిపేస్తూ..తన పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేసుకుంది ఆర్ ఆర్ ఆర్. దీనికి ప్రధాన కారణం రాజమౌళి డైరెక్షన్ అయితే.. రెండో కారణం చరణ్-తారక్. ఈ సినిమా లో వాళ్ళు నటించలేదు. జీవించేశారు. నాలుగేళ్లు మిగతా ప్రాజెక్ట్స్ వైపు చూడాకుండా..కరోనా ని సైతం లెక్క చేయకుండా.. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ.. అభిమానులను ఎంటర్ టైన్ చేయాలని రాత్రి పగలు కష్టపడి..ఫైనల్ గా భారీ సక్సెస్ ను అందుకున్నారు.

ఈ సంధర్భంగా రీసెంట్ గా ముంబైలో RRR సక్సెస్ మీట్ పెట్టారు చిత్ర బృందం. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ బడా స్టార్స్ తో పాటు..టాలెంటెడ్ హీరో ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ కూడా పాల్గొనన్నారు. ఇక వేదిక పై మాట్లాడిన ప్రముఖులంతా కూడా రాజమౌళి-చరణ్-తారక్ లను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యాలు అని..కష్టపడేతత్త్వం ఉన్న హీరోలని.. ఈ సినిమాలో వీళ్లు కాకుండా మరెవరు నటించిన ఇంత పెద్ద సకెస్ కాకపోయుండేదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చరణ్ అద్భుతనటన..ఎమోషన్ సీన్స్ లో తారక్ పర్ ఫామెన్స్.. రాజమౌళి వర్కింగ్ స్టైల్ పై ప్రశంసలు కురింపించారు బాలీవుడ్ బడా స్టార్స్. భారీ విజయాన్ని అందుకున్నందుకు చిత్రయూనిట్‏కు అభినందనలు తెలిపారు.

ఇక ఈ క్రమంలో నే వేదిక పై ఉన్న రాజమౌళి మాట్లాడుతూ.. బాలీవుడ్ బడా హీరో పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్ గురించి మాట్లాడుతూ ఆయన నాతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ బ్రేక్ చేశాడని షాక్ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ..”మేము ముందే అనుకున్నారు. మీరు ..గారు అని పిలిచుకోకూడదు అని. అలాగే మా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నేను అమీర్ ఖాన్ కేవలం మా పేర్లు పెట్టి పిలిచుకోవాలని. సర్, గారు అంటూ రెస్పెక్ట్ వద్దు అని..అస్సలు ఆ పదాలు ఉపయోగించుకోకూడదని. కానీ, ఈ మధ్యనే మా అగ్రిమెంట్ బ్రేక్ చేసారు అమీర్. ఆయన్ని సర్ అని కాకుండా ఏకే అని పిలవడానికి నేను చాలా ఇబ్బందిపడ్డాను..కానీ అగ్రిమెంట్ ప్రకారం అలానే పిలిస్తూ వచ్చాను. అయితే ఆమీర్మాత్రం మా మధ్య ఉన్న అగ్రిమెంట్ బ్రేక్ చేస్తూ నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు” అంటూ చెప్పగానే అక్కడున్న వారు నవ్వుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఫన్నీ వాతావరణం నెలకొంది.

Share post:

Latest