ముఖం చాటేసిన మెగాహీరో..తప్పు చేసిన్నట్లేగా..?

టైం బ్యాడో లేక మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీలో గట్టిగా టార్గెట్ చేస్తున్నారో తెలియదు కానీ..ప్రతి విషయంలో మెగా ఫ్యామిలినీ ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా..ఫ్లాప్ అయితే మరో విధంగా..నెట్టింట మెగా ఫ్యామిలీని ఆడేసుకుంటున్నారు కొందరు ట్రోలర్స్. మీమ్‌స్ కూడా నవ్వుకునే విధంగా ఉంటే బాగుంటాయి.. ఒకరిని నవ్వులపాలు చేసే విధంగా ఉంటే ఛండాలంగా ఉంటాయి. రోజు రోజుకు హద్దులు మీరిపోతున్నారు ట్రోలర్స్..అయినదానికి కానిదానికి మెగా ఫ్యామిలీనీ వాడేసుకుంటున్నారు.

మనకు తెలిసిందే చిరంజీవి తమ్ముడు..పవన్ కల్యాన్ రెండో మాజీ భార్య..రేణు దేశాయి కి విడాకులు ఇచ్చేశాడని..వాళ్ళు దూరంగా ఉంటున్నారని. ఇచ్చిన ఆయన హ్యాపీగానే ఉన్నాడు..పుచ్చుకున్న ఆమె కూడా ప్రాబ్లం లేదు అంటూ సంతోషంగానే ఉంది..మధ్యలో అటు ఇటు కాకుండా ఉంటారే ఓ బ్యాచ్ వాళ్ళ కి ఏం ప్రాబ్లమో అర్ధంకాదు. ప్రతి విషయానికి పవన్ కల్యాణ్ ని మధ్యలోకి లాగుతూ ఆయన పై బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారు.

రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ హీరో గా నటిస్తున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుండడం గమనార్హం. ఇందులో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అంత వరకు బాగానే ఉంది. కానీ అక్కడ అందరిని నవ్వుతూ పలకరించిన చిరంజీవీ.. అదే ఈవెంట్‌లో ఉన్న రేణు దేశాయ్ ని చూసి ముఖం చాటేశాడు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి వేడుక‌లో ఉన్న ప్ర‌ముఖులంద‌రినీ ప‌ల‌క‌రించారు కానీ రేణు దేశాయ్ ని మాత్రం చూసి చూడ‌న్న‌ట్లు అనిపించింది అని వీడియో ని ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. కొందరైతే తప్పు చేశాడు అందుకే ముఖం దాచుకున్నాడు అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు కానీ మెగా ఫ్యాన్స్ వర్షెన్ మాత్రం వేరేలా ఉంది. చిరంజీవి రేణు.. చూపులతోనే చిరున‌వ్వుతో పలకరించుకున్నారు అని అంటున్నారు . దీంతో ఈ మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Popular