ఈ అక్కాచెల్లెలితో యాక్టింగ్ చేసిన ఏకైక స్టార్ హీరో..?

1978వ సంవత్సరంలో మెగాస్టార్ మొదటిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పేరుకే డైరెక్టర్ , నిర్మాత క్రాంతికుమార్.. ప్రాణంఖరీదు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన డైరెక్టర్ కాంతి కుమార్ కు మరొక సినిమా అవకాశాన్ని రూపొందించడానికి అవకాశం ఇచ్చారు చిరంజీవి. క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం.. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో న్యాయం కావాలి చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ రాధిక , చిరంజీవి నటించారు.

కోదండరామి రెడ్డి, చిరంజీవి, రాధిక ఇలా వీరు అందరూ కలిసి మొదటిసారిగా ఈ సినిమా తోనే కలవడం జరిగింది. ఇక అలా ప్రారంభమైన చిరంజీవి – రాధిక కాంబినేషన్.. 1990 వరకు కొనసాగిందని చెప్పవచ్చు. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు, పట్నం వచ్చిన ప్రతివతలు, పులి బొబ్బిలి, శివుడు శివుడు శివుడు, గూడచారి నెంబర్ వన్, అభిలాష, ఊరికి మొనగాడు, జ్వాల, ఇక మరికొన్ని సినిమాలలో కలిసి నటించారు చిరంజీవి – రాధిక. ఇక ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన న్యాయం కావాలి, అభిలాష సినిమాలు వీరిద్దరిని ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర చేశాయి. ఇక మరొక చిత్రం యువతను బాగా అట్రాక్ట్ అయ్యేలా చేసింది.

అయితే ఎన్టీరామారావు – రాధికతో.. వయ్యారి భామలు వగలమారి భర్తలు.. సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆమెతో నేరుగా జోడి కట్టలేదు. అందులో ఎన్టీఆర్ కి జోడీగా శ్రీదేవి నటించింది. ఏఎన్నార్ కు జోడిగా రాధిక నటించింది. ఇలా ఇండస్ట్రీ లో ఉండే స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది. 1988 డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఒక తమిళ సినిమా చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది నిరోష. అటు తరువాత మహాజనానికి మరదలు పిల్ల, బుజ్జిగాడు బాబోయ్, భలే ఖైదీలు, వన్ బై టు వంటి చిత్రాలలో నటించింది.

1991 క్రియేటివ్ కమర్షియల్ ఎస్ రామారావు నిర్మాణం, మండ మూర్తి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ విడుదలైంది.. ఈ సినిమాలో చిరంజీవి రాధిక – నిరోష హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక రాధిక, నిరోష అక్కాచెల్లెళ్ల తో పాటుగా ప్రముఖ కథానాయికలు.. నగ్మా, జ్యోతిక, రోషిని వంటి అక్క చెల్లెలు తో నటించిన ఏకైక హీరో కూడా మెగాస్టార్ కావడమే విశేషం.