మహేష్ బాబుతో ఎప్పటికైనా సినిమా చేయాలని ఉంది అంటోన్న స్టార్ డైరెక్టర్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ద్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఎప్పటికైనా తాను మహేష్ బాబుతో సినిమా చేస్తానంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోలను చూపించే విధానం అభిమానులకు బాగా నచ్చుతుంది.

దీంతో మహేష్ లాంటి క్లాస్ హీరోకు బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ పడితే ఆ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని.. ఆయనతో ఎప్పటికైనా సినిమా తెరకెక్కిస్తానని బోయపాటి అంటున్నారు. మరి నిజంగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా లేదా అనేది కాలమే చెబుతుందని అభిమానులు అంటున్నారు.

Share post:

Latest