పెళ్లైన మగాళ్లలో అది బాగుంటుందట..నటి కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్య కాలంలో రియాలిటీ షో లు ఎక్కువైపోయాయి. ఇప్పటికే బిగ్ బాస్ అంటూ ఓ రియాలిటీ షో తెగ పాపులర్ అయ్యింది. కాగా రీసెంట్ గా లాకప్ అనే షో మొదలు పెట్టారు బాలీవుడ్ లో. ఈ షో కి హోస్ట్ గా కాంట్రవర్షీయల్ క్వీన్ బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్ చేస్తుంది. హోస్ట్ తోనే సగం పాపులర్ అయ్యింది ఈ షో. ఇక ఈ షో నుండి ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ల జీవితంలో ఎవ్వరికి చెప్పని నిజాని అందరి ముందు చెప్పాలి. ఇలా బోలెడు మంది టాప్ సెలబ్రిటీలు వాళ్ల పరసనల్ మ్యాటర్స్ లీక్ చేసి నెట్టింట ట్రెండింగ్ గా మారారు.

ఇక ఇప్పుడు ఓ నటి..సహ కంటెస్టెంట్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. అంతా హాట్ కామెంట్స్ చేసింది. షో లో గత కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ అజ్మా ఫల్లా, ప్రిన్స్ నరులా మధ్య జరుగుతున్న యవ్వారం మనం చూస్తూనే ఉన్నాం. గత వారం అయితే పెద్ద ఎత్తున ఫైట్ కూడా జరిగింది. ఆ ఫైట్ చూసి మిగతా కంటెస్టెంట్స్ కూడా భయపడిపోయారు. అయితే, ఏమైంది ఏమో తెలియదు కానీ తాజా ఎపిసోడ్‌లో ఈ జోడీ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది.

తాజాగా మనం ఈ షో లో గమనించిన్నట్లైతే ప్రిన్స్‌ వైపు కొంటె చూపులు చూస్తూ .. ముసు ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది అజ్మా. దీనిని గమనించిన మునావర్ ఫరూఖీ.. ప్రిన్స్‌ను చూస్తూ ఎందుకంతగా సిగ్గుపడుతున్నావని ప్రశ్నిస్తాడు.. దీనికి వెంటనే అజ్మా..ప్రిన్స్ నరులా బాగుంటాడు. నిజానికి ఫస్ట్ లుక్ లో కనెక్ట్ అయిపోయా. ఈ మధ్య ఇంకా నచ్చేస్తున్నాడు. అతనితో రిలేషన్ షిప్ కావాలనుకుంటున్నా అంటు చెప్పేస్తుంది. దీంతో వెంటనే మునావర్ ఫరూఖీ అతనికి పెళ్ళైంది..అతది భార్య ఈ షో చూస్తుంటుంది అంటాడు. అప్పుడు అజ్మా..” పెళ్లైన మగాళ్లలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. వెంటనే కనెక్ట్ అయిపోతాం” అంటూ అనడంతో ఆమె మాటలు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి. అయితే ప్రిన్స్ నరులా మాత్రం ఆమె ప్రేమకు ఫిదా అయినట్లు తెలుస్తుంది. అజ్మాను కౌగిలించుకోవడం, కలిసి స్టెప్స్ వేయడం తో మ్యాటర్ హద్దులు దాటేటట్లుంది అంటున్నారు జనాలు. మరి చూడాలి మునుముందు ఏం జరుగుతుందో..?

Share post:

Popular